వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. తాజా మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ… మన పార్టీలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తాం. కార్యకర్తలే రేపటి ప్రజా నాయకులు. కార్యకర్తలు చెప్పిందే సిద్ధాంతం. అదే పార్టీ రాజ్యాంగం అని పేర్కొన్నారు. తెలంగాణలో వైఎస్ తో లబ్ది పొందని ఇల్లే లేదు అన్నారు. వైఎస్ సంక్షేమ పాలనను గుర్తు తెచ్చేలా… తెలంగాణ ఆకాంక్షలకు అద్దం పట్టేలా… పార్టీ ఎలా ఉండాలో కార్యకర్తలే చెప్పాలి. ప్రజలందరి భాగస్వామ్యం మనకు…
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కరోనా బారిన పడిన వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండి నిబంధనలు పాటిస్తే తప్పనిసరిగా కరోనా బారి నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. సాధారణ వ్యక్తులు కరోనా బారిన పడితే, ఐసోలేషన్ కేంద్రాలకు వెళ్లి అక్కడే ఉండటం చేస్తారు. ఇక పల్లేల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పల్లెల్లో కరోనా బారిన పడిన వ్యక్తులు ఊరికి దూరంగా ఉంటున్నారు. కరోనా తగ్గేవరకు గ్రామంలోకి అడుగుపెట్టడంలేదు. అయితే, తెలంగాణలోని ఖమ్మంజిల్లా,…
నైరుతి రుతుపవనాల ప్రభావం తెలంగాణపై కనిపిస్తోంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో జోరగా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారు జాము నుంచి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్‌లోని హుజూరాబాద్, జమ్మికుంట, వేములవాడ, శంకరపట్నం, సైదాపూర్‌లో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెలపిలేని వర్షం కురుస్తోంది. కామారెడ్డిలో భారీ వర్షం కురవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.…
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచాయి. రోజురోజుకు పెరుగుతున్న రేటుతో పెట్రోల్ బంకుకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 28 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ మార్క్ దాటి దూసుకెళ్తున్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.100.98, డీజిల్ రూ.92.99కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.101.52 గా ఉండగా.. డీజిల్ రూ. 95.91…
తెలంగాణలో ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు తెలంగాణలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో సీడ్ & ఫెర్టిలైజర్ దుకాణాలపై జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరు దుకాణాలలో తనిఖీలు చేపట్టగా.. సుమారు 8 లక్షల విలువైన అనుమతుల్లేని పత్తి విత్తనాలను పట్టుకున్నారు.…
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపటి కిందే ముగిసింది. వానాకాలం సాగుపై వ్యవసాయశాఖ సంసిద్ధత మీద కెబినెట్ లో పూర్తిస్థాయి సమీక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై కెబినెట్ హర్షం వ్యక్తం చేసింది. గత ఏడాది వానాకాలం, యాసంగి కలిపి 1,06,03,927 ఎకరాల్లో కేవలం వరి పంట సాగు చేయడం ద్వారా సుమారు 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి రావడం…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులోకిరాని ఏడు నియోజకవర్గాలలో లాక్ డౌన్ ను యథాతథంగా అమలు చేయాలని కెసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నియోజకవర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యథాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉదయం 6 గంటల నుంచి పగలు 1 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉంటుంది. కరోనా పరిస్థిని తెలుసుకునేందుకు…
రేషన్ కార్డుల కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ ప్రగతిభవన్‌లో సమావేశమైన కేబినెట్.. కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది.. పెండింగ్‌లో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది తెలంగాణ కేబినెట్.