నాలుగవ తేదీ న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది. అందులో హుజూరాబాద్ ఉప ఎన్నిక తో పాటు… రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాల పై చర్చ ఉంటుంది అని అన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు Nvss ప్రభాకర్. హైదరాబాద్ తీవ్రవాదులకు అడ్డాగా మారింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చి అక్రమంగా ఉంటున్నారని మేము చెబుతూనే ఉన్నాం. బోధన్, బైంసా, నల్గొండ, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా దొంగ పాస్పోర్ట్ లతో ఉంటున్నారు. మత కోణంలో వారి పై చర్యలు తీసుకోవడం లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నకిలీ బంగారం, మాదక ద్రవ్యాలు బయట పడుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న ఇంటిలిజెన్స్ ఏమి చేస్తుంది. పొలిటికల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ గా మారిపోయింది. అనేక అసాంఘిక కార్యక్రమాలకు హైదరాబాద్ కేంద్రం అయింది. తెరాస, ఏంఐఏంల రాజకీయ పొత్తు వల్లనే ఇదంతా జరుగుతుంది. పోలీసుల కు ఫ్రీడమ్ ఇవ్వడం లేదు అని పేర్కొన్నారు.