తెలంగాణ సిఎం కెసిఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్‌చుగ్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో యుద్ధం నడుస్తుందని.. అది ఆత్మగౌరవనికి, అహంకారానికి మధ్య యుద్ధం నడుస్తుందన్నారు. ఈటల బీజేపీలోకి రావడం అంటేనే కేసీఆర్ ఓడిపోవడమని విమర్శలు చేశారు. ఒక్క వ్యక్తి, అతని కుటుంబం చేస్తున్న అరాచకాల మీద ఈటల గొంతు వినిపించారన్నారు. ఇన్నాళ్లు ఈటల trsలో సంఘర్షణ పడ్డారని…తనను నమ్మిన ప్రజల బాగు కోసం అనేక రకాలుగా ప్రయత్నించారని తెలిపారు. కెసిఆర్ కు ఆయన…
తెలంగాణలో ఈ రోజు నైరుతి ఋతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉత్తర బంగాళాఖాతం & పరిసర ప్రాంతాలలో ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు వాయువ్య బంగళాఖాతం, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో అల్ప పీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు ఆవర్తనము వ్యాపించింది. రాగల 24 గంటలలో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా మీదగా వెళ్ళే అవకాశం ఉంది. ఈ…
పెట్రోల్, డీజిల్ ధరలపై సీఎం కేసీఆర్ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడంలేదని నిలదీశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పెట్రో ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో సంగారెడ్డి పాత బస్టాండ్ దగ్గర నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరలు యూపీఏ హయాంలో అదుపులో ఉన్నాయి.. కానీ, ప్రధాని మోడీ ఈ ఏడేళ్ల పాలనలో ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని విమర్శించారు.. మోడీ పెట్రో ధరలను సెంచరీ దాటించారని…
కోవిడ్, ధాన్యం కొనుగోళ్లు రెండింటిలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయ్యింది అని వైఎస్ షర్మిల తెలిపారు. ధాన్యం పండించిన రైతులు ఇబ్బందులు పడుతుంటే .. కేసీఆర్ పట్టించుకోవడం లేదు. మొండి నమ్మకంతో గుండె నిబ్బరంతో సాగు చేస్తున్న రైతులు గుండెలు బాదుకునేలా అరుస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. చివరి గింజ వరకు కొంటానని చెప్పిన తర్వాతే కదా రైతులు సాగు చేసింది. బట్టలు మార్చుకునేంత ఈజిగా మాట మారుస్తారా అని ప్రశ్నించిన షర్మిల 80 వేల పుస్తకాలు…
అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కుంభకోణంపై దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుపుతుంది. అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన ప్రతిపాదనకు తీవ్రంగా స్పందించారు జస్టిస్ ఎంఎస్ రామచందర్ రావు, జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ బెంచ్. అగ్రిగోల్డ్ కంపెనీ ప్రతిపాదనకు అంగీకరిస్తే మరో ఇరవై ఏళ్లు హైకోర్టు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందన్న హైకోర్టు… అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన సవరించిన ప్రతిపాదనలపై సమాధానం ఇవ్వాలని ఎపి, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులు ఎక్కువగా…
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ రేపు రాజీనామా చేయబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అనంతరం రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో ఇవ్వనున్నారు. ఈనెల 14 వ తేదీన ఈటల ఢిల్లీవెళ్లి పెద్దల సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. ఈటలతో పాటుగా మరికొంతమంది కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నది. ఒకరోజు ముందుగానే ఈటల ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. దేవరయాంజల్ లో భూములను ఆక్రమించుకున్నారని ఈటలపై ఆరోపణలు…
భూముల విక్రయానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. దీని కోసం కమిటీలు ఏర్పాటు చేసింది.. సీఎస్ సోమేష్ కుమార్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.. భూములకు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీ, భూములకు అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ ఏర్పాటు చేసింది. అలాగే, భూముల అమ్మకాలను పర్యవేక్షించేందుకు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు.. నోడల్ శాఖ భూముల ధరను నిర్ణయించి.. ఈ వేలం ప్రక్రియ నిర్వహిస్తుంది. ఈ వేలం ద్వారా పారదర్శకంగా…
తెలంగాణలో క్రమంగా కోవిడ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,30,430 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,798 మందికి పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ బారినపడి మరో 14 మంది మృతి చెందారు. ఇక, 24 గంటల్లో 2,524 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ప్రస్తుతం 23,561 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,98,611కు చేరింది, రికవరీ…
కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పరీక్షలు రద్దు అయితే, మరికొన్ని పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి.. మరోవైపు.. వివిధ పోటీ పరీక్షల దరఖాస్తుల గడువులు కూడా పొడిగిస్తూ వస్తున్నారు.. తాజాగా, మరోసారి తెలంగాణ ఎంసెట్-2021 ఆన్లైన్ దరఖాస్తుల గడువును పొడిగించారు. దరఖాస్తు చేసుకోవడానికి మరో వారం రోజులు గడువు ఇచ్చారు.. లేట్ ఫీజు లేకుండా ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటించారు.. కాగా, ఎంసెట్‌కు ఇప్పటి వరకు 2,20,027 దరఖాస్తులు…