ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దుపై అధికారికంగా ప్రకటించారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఇంటర్ బోర్డు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె… ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షలను రద్దు చేసినట్టు ప్రకటించారు.. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేశాం.. ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా ఫలితాలు వెల్లడిస్తామని.. ఫలితాలపై త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తామని తెలిపారు. అయితే, విద్యార్థులెవరైనా పరీక్షలు రాయాలనుకుంటే మాత్రం… కరోనా మహమ్మారి పరిస్థితులు చక్కబడిన తర్వాత…
తెలంగాణలో లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. సడలింపుల సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కొత్త సడలింపులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.. మొత్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెసులుబాటు ఉండనుండగా.. మరో 12 గంటల పాటు.. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయనున్నారు. ఇక, లాక్డౌన్ సడలింపుల సమయం పెరగడంతో.. తన సేవల సమయాన్ని కూడా…
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చొరవతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య భారీగా పెరిగింగి.. ఏకంగా న్యాయమూర్తుల సంఖ్య 75 శాతం పెంచారు.. దీంతో.. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెరిగింది. న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు నుంచి గత రెండేళ్లుగా సుప్రీంకోర్టుకు అనేక విజ్ఞప్తులు అందగా.. దీనికి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు.. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం సుప్రీంకోర్టు కొలీజియం ద్వారా జరుగుతుండగా.. వివిధ రాష్ట్రాల హైకోర్టుల…
ఉత్తర బంగాళాఖాతం & పరిసర ప్రాంతాలలో ఈ నెల 11వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి ఈ రోజు దక్షిణ ఒడిస్సా నుండి తెలంగాణా మీదగా గుజరాత్ వరకు సముద్ర మట్టానికి 3.1 కిమి నుండి 5.8 కిమి వరకు వ్యాపించి ఉన్నది. రాగల 3 రోజులు (09,10,11వ తేదీలు)తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి. వాతావరణహెచ్చరికలు రాగల 3 రోజులు (09,10,11వ.తేదీలు) ఉరుములు మరియు మెరుపులతో…
లాక్డౌన్ను మరో పది రోజులు పొడిగిస్తూ.. మంగళవారం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. గతంలో విధించిన లాక్డౌన్ ఇవాళ కూడా అమల్లో ఉండనుంది.. కొత్త లాక్డౌన్ సడలింపులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.. కానీ, ఈ విషయంలో గందరగోళానికి గురైన ప్రజలు… ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా భారీగా రోడ్లపైకి వస్తున్నారు.. గురువారం నుండి ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల వరకు.. ఇళ్లకు చేరుకోవడానికి అదనంగా మరో గంటతో సాయంత్రం 6 గంటల…
రాష్ట్రం ఉప ఎన్నికలు ఎక్కడ వచ్చినా.. అక్కడ వరాల జల్లు కురిపించడం సీఎం కేసీఆర్ సాంప్రదాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోనీ ఇల్లంతకుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 20 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్నాను.. ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నా.. నా రాజీనామా తర్వాత అయినా పెన్షన్లు, పింఛన్లు వస్తాయని భావిస్తున్నానన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పెన్షన్, రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారందరీకీ వెంటనే ఇవ్వాలని..…
ఔషధాల బ్లాక్ మార్కెట్ పై 160 కేసులు నమోదు చేసినట్లు హైకోర్టుకు నివేదిక సమర్పించారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వరకు 8.79 లక్షల కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాస్కులు ధరించని వారిపై 4.56 లక్షల కేసులు, రూ.37.94 కోట్ల జరిమానా విధించారు. భౌతిక దూరం పాటించనందుకు 48,643 కేసులు… లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 3.43 లక్షల కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ ను నిబంధనల మేరకు…
హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడిపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అటవీ శాఖ అధికారులు.. అటవీశాఖకు చెందిన కైసర్ నగర్ సర్వే నంబర్ 19లో ఉన్న భూమిని చదును చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అటవీశాఖ సెక్షన్ అధికారి శ్రీనివాస్ రెడ్డి… అటవీశాఖ సిబ్బందితో కూన జైకుమార్ గౌడ్ మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు తెలుస్తోంది.. అయితే, గాజులరామారం సర్కిల్ కైసర్ నగర్లో సర్వే నంబర్ 28లో తన సొంతభూమిలో…
కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు డీహెచ్ శ్రీనివాస రావు. మే 29 నుంచి రోజుకు సరాసరి లక్ష పరీక్షలు జరుగుతున్నాయి అని తెలిపిన డీహెచ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 66,79,098 వ్యాక్సిన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో ఇన్ పేషంట్లు తగ్గుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 36.50 శాతం, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 16.35 శాతం పడకలు నిండాయి. మూడో దశ ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10,366 ఆక్సిజన్ పడకలుగా మార్చాం.మిగతా 15వేల పడకలకు ఆక్సిజన్…
వైఎస్ షర్మిల కొత్తపార్టీని ఇప్పటికే ప్రకటించింది. కొత్త వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీని పెట్టబోతున్నారు. కాగా ఈరోజు షర్మిల కొత్త పార్టీ గురించి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు. కేసులకు భయపడి ఈటల రాజెందర్ బీజేపీలో చేరుతున్నారనీ, టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వారిపై కేసులు పెట్టడం కామన్ అయిందని అన్నారు. ఈటల తమ పార్టీలోకి వస్తామంటే తప్పకుండా ఆహ్వనిస్తామని, ఇప్పటి వరకు ఈటలతో ఈ విషయంపై చర్చించలేదని అన్నారు.…