సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్.. తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరానికి పురమాయిస్తూ ఉంటారు… తాజాగా, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన శంకర్ గౌడ్ అనే వ్యక్తి తన ఇంటి అనుమతి కోసం వేధిస్తున్నారంటూ సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్లో తన ఆవేదన వ్యక్తపరిచాడు. ఇంటి అనుమతి కోసం నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించినప్పటికి ఇక్కడ కొందరు డబ్బుల కోసం తనకు అనుమతి ఇవ్వడం లేదంటూ కేటీఆర్ కు ట్వీట్ చేశాడు.. ఈ వ్యవహారం శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించగా షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయం వర్గాలు ఆగమేఘాల మీద శంకర్ గౌడ్ కు అనుమతి ఇచ్చేశారు. అంటే.. మంత్రిగారి దృష్టికి వస్తే గానీ.. మీరు పనిచేయరా అంటూ.. మున్సిపల్ సిబ్బందిపై మండిపడే వారు లేకపోలేదు.. మొత్తంగా.. ట్వీట్ మాత్రం అధికారులను షేక్ చేసింది.