నైరుతీ గాలుల ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాగల 24 గంటల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు,మెరుపులతో కూడి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. రాబోయే 24 గంటల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. అతి తేలికపాటి నుంచి తేలికపాటి…
తెలంగాణలోని హుజురాబాద్‌కు త్వరలోనే ఉప ఎన్నిక జరగనున్నది. ఈటల రాజీనామా తరువాత ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, టీఆర్ఎస్ నుంచి ఎవర్ని నిలబెడుతున్నారన్నది ఇప్పటి వరకు ఆసక్తికరంగా ఉంది. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిని పార్టీ ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎన్నుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంపీ సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. సతీసమేతంగా తిరుమల చేరుకున్న ఆయన బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు సంతోష్ కుమార్ దంపతులకు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి వారికి స్వామివారి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. నేడు ఎంపీ సంతోస్ కుమార్ వివాహ వార్షికోత్సం కావడంతో స్వామివారిని దర్శించుకున్నారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో.. కారుతో పాటు దగ్దమైన వ్యక్తిని గుర్తించారు పోలీసులు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో… వివరాలు తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే, నోటిలో ఉన్న కృత్రిమ పళ్ల ద్వారా మృతుడు శ్రీనివాస్‌గా గుర్తించారు కుటుంబసభ్యులు. ఐతే…ఎక్కడో చంపేసి కారు డిక్కీలో మృతదేహాన్ని తగలబెట్టినట్లు పోలీసుల తెలిపారు. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఫైనల్… ఇవాళ ప్రకటన ! అటవీ ప్రాంతానికి సమీపంలో రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తులు కారును…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 494 కరోనా కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,50,353కి చేరింది. ఇందులో 6,38,410 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 8,112 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతిచెందినట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 3,831కి చేరింది. ఇక ఇదిలా…
ఆయన ఓడిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఓడినచోట మళ్లీ పోటీచేసే అవకాశం దక్కుతుందో లేదో తెలియదు. పక్కచూపులు చూస్తున్నారని ఆ మధ్య పెద్దఎత్తున ప్రచారం జరిగింది. పార్టీ పెద్దల బుజ్జగింపులతో సైలెంట్. కానీ.. పరామర్శ పేరుతో మరో నాయకుడితో తాజాగా జరిగిన భేటీ కొత్త ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోంది. తీగలాగుతున్నారా? గాలానికి తీగ తగులుతుందా అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా భేటీ? లెట్స్ వాచ్! మళ్లీ చర్చల్లోకి వచ్చిన తీగల! తీగల కృష్ణారెడ్డి.…
చెన్నమనేని పౌరసత్వ వివాదం కేసులో విచారణ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.. ఇవాళ్టి హైకోర్టు విచారణకు కేంద్ర ప్రభుత్వం తరపున అస్సిటెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు హాజరయ్యారు.. ఇదే సమయంలో… బుక్ లెట్ రూపంలో కోర్టుకు నివేదిక సమర్పించారు పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ రావు… 2019 వోసీఐ కార్డ్ బెర్లిన్ లో ఇండియన్ అంబసి ద్వారా చెన్నమనేని తీసుకున్నాడని కోర్టుకు వివరించారు.. వోసీఐ దరఖాస్తు ఫామ్ 10 కాలంలో నేషనాలిటీ…
ఇంద్రవెల్లి సభ ను రేవంత్ తన నోటి దురుసుతనం ప్రదర్శించేందుకు పెట్టుకున్నారు. అది దళిత, గిరిజనుల కోసం పెట్టిన సభ కాదు అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రేవంత్ దొడ్డి దారిన పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. రేవంత్ భాషను చూస్తే ఆయన ముఖం మీద ఉమ్మి వేయాలని కోట్లాది ప్రజలకు ఉంది. కుక్క కాటుకు చెప్పు అనే రీతిలో రేవంత్ కు తగిన శాస్తి చేయాలి. సీఎం కేసీఆర్ పై రేవంత్ వాడిన భాష ను…
వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.20 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్… ఇవాళ రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు.. మర్యాదపూర్వకంగా కేటీఆర్‌ను కలిశారు.. తన నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మంత్రికి అందించారు. ఇక, ఆ తర్వాత వేములవాడ అభివృద్ధిపై సమీక్షించిన మంత్రి కేటీఆర్.. అభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ చేశారు. రూ.20 కోట్ల విలువైన పనులు ప్రారంభించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం…
టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి… ఇంద్రవెల్లి సభ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. రేవంత్ లాగా పగతోని.. ప్రతికారంతో రాజకీయం చేస్తే ఆయన రోడ్డుపై తిరగగలడా? అని ప్రశ్నించారు.. రేవంత్ దిగజారిన భాష చూసి తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఊగి పోతున్నారన్న సైదిరెడ్డి.. టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను బలి దేవత అన్నారు.. ఇప్పుడు మహా దేవత అంటున్నారు అని ఎద్దేవా చేశారు.. సీఎం కేసీఆర్…