ఢిల్లీ పర్యటనకు కేసీఆర్.. మూడు రోజుల టూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి హస్తినబాట పట్టనున్నారు తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్ కేసీఆర్.. ఈ సారి మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగనుంది.. కేసీఆర్ పర్యటనకు ఈసారి చాలా ప్రత్యేకత ఉంది.. ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించి.. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని ఎప్పటి నుంచో భావిస్తున్న గులాబీ పార్టీ అధినేత.. హస్తినలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేయనున్నారు.. ఇక, ఈ మూడు రోజుల పర్యటనలో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది.
ఇక, సీఎం పర్యటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరనున్న ఆయన.. సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేస్తారు.. సీఎం కేసీఆర్ తో పాటు ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నాయకులు పాల్గొంటారు.. ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ పక్కన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 1300 గజాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.. అక్కడే నిర్మాణం చేపట్టనున్నారు.. ఇక, సెప్టెంబర్ 3న మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు కేసీఆర్.
Also Read
తాజావార్తలు
-
Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
-
Mammootty: దారి తప్పిన స్టార్ హీరోకు సామాన్యుడి సాయం.. వైరల్ అవుతున్న మమ్ముట్టీ వీడియో!
-
Rocking Star Yash: యశ్‌ను పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశ్నించగా.. ఊహించని సమాధానం ఇచ్చిన రాకింగ్ స్టార్!
-
CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
-
Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?