తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్టుల టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ తుది రిపోర్టులు కేంద్రం నుంచి అందాయి. మొత్తం ఆరింటిలో మూడు మాత్రమే పూర్తిస్థాయి ఎయిర్ పోర్టుల నిర్మాణం, పెద్ద విమానాల రాకపోకలకు అనుకూలమని, మరో మూడు అందుకు అనుకూలంగా లేవని ఎయిర్ పోర్టుల అథారిటీ తేల్చింది. తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎయిర్ పోర్టుల ఏర్పాటు, విమాన రాకపోకల సాధ్యాసాధ్యాలు, వాటివల్ల కలిగే లాభనష్టాలను భారత విమానయాన సంస్థ బేరీజు వేసింది. మొత్తం ఆరింటిలో…
రైతు బంధుతో కేసీఆర్ దేశానికి ఆదర్శంగా, దిక్సూచిలా నిలిచారని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 36 ఏళ్లుగా దేశంలోని సమస్యల మీద కవులు, కళాకారులు, మీడియా స్పందించినట్లు మాదిరిగా సినిమా మాద్యమం ద్వారా తాను స్పందిస్తున్నానని తెలిపారు. అర్ధరాత్రి స్వతంత్రం నుండి అన్నదాత సుఖీభవ వరకు 36 సినిమాలు తీశానని..ఈ నెల 14న 37వ సినిమా “రైతన్న” విడుదలవుతుంది.. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టాలు,…
హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం అందికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది అధికార టీఆర్ఎస్ పార్టీ… విద్యార్థి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బరిలోకి దింపింది.. మరోవైపు.. తన నియోజకవర్గమైన హుజురాబాద్లో ఈటల రాజేందర్ పాదయాత్రలు, సభలు, సమావేశాలు జరుగుతున్నా.. ఆయనే అభ్యర్థి అని ఇప్పటి వరకు అధిష్టానం తేల్చింది లేదు.. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి వేటలో ఉంది.. అయితే, గెల్లు శ్రీనివాస్ యాదవ్.. కేసీఆర్ బానిస అంటూ ఈటల రాజేందర్ కామెంట్ చేయడంపై…
ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా ఎన్నికైనా నోముల భగత్.. ఇవాళ స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డు ఈ సందర్భంగా నోముల భగత్ కు అందించారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి,ఆబ్కారీ శాఖ…
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ ఏపీకి రానున్నారు. శ్రీశైలం ఆలయంలో షా పూజలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి తొలుత హైదరాబాద్కు చేరుకోనున్నారు. 11.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి., అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.25కు కర్నూలు శ్రీశైలంలోని సున్నిపెంటకు అమిత్ షా చేరుకుంటారు. అనంతరం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు. అక్కడి…
విశాఖలో వెలుగుచూసిన హనీట్రాప్ కేసును చేధించారు విశాఖ సైబర్ క్రైం పోలీసులు.. డీసీపీ సురేష్ బాబు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన యువకుడిని హైదరాబాద్ కి చెందిన భార్య భర్తలు ట్రాప్ చేశారు.. వేపగుంటకు చెందిన యువకుడికి వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్లు మెసేజ్ పంపించి ఎర వేశారు.. ఆ తర్వాత వీడియో కాల్ చేసి నగ్నంగా ఉన్నప్పుడు రికార్డ్ చేసింది మహిళ.. ఇక, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.. డబ్బులు ఇవ్వకపోతే…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆలోచించాలి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న పార్టీలు ఈ ప్రాంతానికి ఏం చేశాయి. ఆ పార్టీలు సంక్షేమం గురించి పట్టించుకున్నాయా అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు, నీళ్లు సరిగా ఉన్నాయా… నీళ్లు లేవు నీళ్లు ఉన్న కరెంటు లేదు. రైతుల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో మన…
డీఆర్ సీసీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ ఏడాది నీటికేటాయింపులపై త్వరలో సమావేశం ఏర్పాటు అవుతుంది అని జిల్లా ఇంఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. భీమా విషయంలో రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జిల్లాలో 429 లేఅవుట్ లలో ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం. 229 లేవుట్ లలో పనులు ప్రారంభించాం. ఇసుక అందరికి అందుబాటులోకి తెస్తున్నాం.172 ప్రాంతాల లో ఇసుక రీచ్ లను గుర్తించాం. ట్రాక్టర్, బండ్లతో ఉచితంగా ఇసుక…
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం వెళ్లనున్నారు.. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్షా… ఆ తర్వాత బేగంపేట్ నుంచి హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లనున్నారు. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అక్కడే లంచ్ చేసి.. తిరిగి హెలికాప్టర్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకోనున్న ఆయన.. అనంతరం తిరిగి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు.. మొత్తంగా..…
ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువతకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ ఉద్యమంతో పాటు స్వయం పాలనలో యువత పాత్ర గొప్పదన్నారు.. తెలంగాణ ఏర్పాటుతో రాజకీయ, పాలనా రంగాల్లో విద్యార్థి యువనేతలకు చట్టసభల్లో పెద్దఎత్తున అవకాశాలు కల్పించి బడుగు బలహీన వర్గాల యువతను ప్రోత్సహిస్తున్నామన్న సీఎం.. ఈ ప్రక్రియ మునుముందు కూడా కొనసాగుతుందని తెలిపారు. యువత భవిష్యత్తున్ దృష్టిలో వుంచుకుని వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడే…