సూర్యాపేట జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. సూర్యాపేట మండలం రాజు నాయక్ తండా ఓ మహిళలను అందరూ చూస్తుండగా కళ్లలో కారం కొట్టి, వివస్త్రను చేసి వీధుల్లో తిప్పుతూ దాడి చేశారు కొందరు వ్యక్తులు.. అయితే, ఇవాళ ఆ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.. మహిళను వివస్త్రను చేసి కళ్లలో కారం కొట్టి వీధుల్లో తిప్పుతూ దాడి చేసిన తండావాసులను అరెస్ట్ చేసేందుకు ఆ గ్రామానికి వెళ్లారు సూర్యాపేట రూరల్ పోలీసులు.. అయితే, తాము ఎలాంటి తప్పు చేయలేదని తండావాసులు అంటున్నారు.. కానీ, మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించవారిని ఎట్టి పరిస్థితిల్లో వదిలేది లేదని.. అరెస్టు చేసి తీరుతామని అంటున్నారు పోలీసులు.. రాజు నాయక్ తండాలో భారీ ఎత్తున పోలీసులు మోహరించడంతో.. ఉద్రిక్తత నెలకొంది.
కాగా, జూన్ 13వ తేదీన రాజు నాయక్ తండాకు చెందిన శంకర్‌నాయక్ జూన్ 13న హత్యకు గురయ్యాడు. ఆ ఊరికే చెందిన బాధితురాలిని ఆ కేసులో ఒక నిందితురాలిగా అరెస్ట్ చేశారు.. శంకర్‌నాయక్ బంధువులతో సదరు మహిళకు పాతకక్షలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.. ఇక, హత్య కేసులో అరెస్ట్ అయిన మహిళ.. తాజాగా బెయిల్ పై విడుదలైంది.. మొదటిసారిగా నిందితురాలు ఆ తండాకు వచ్చింది.. దీంతో.. కోపంతో ఊగిపోయిన శంకర్ నాయక్ బంధువులు.. మరికొందరు గ్రామస్తులు.. అందరూ చూస్తుండగానే బాధిత మహిళ కళ్లలో కారం కొట్టి, వివస్త్రను చేసి వీధుల్లో తిప్పుతూ దాడికి పాల్పడ్డారు.. ఈ ఘటన కలకలం రేపగా.. ఇప్పుడు పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో.. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.