బీజేపీ ఆడిస్తున్న నాటకంలో ఒక భాగం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. లాభం జరిగే దళిత వర్గాలకు నష్టం కలిగే కుట్ర బీజేపీ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళను వాడుకొని చేస్తోంది. కేవలం రాజకీయ విమర్శల కోసం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు అని తెలిపారు. ఆ తర్వాత ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ… ప్రవీణ్ కుమార్ కలలు కలగానే మిగిలిపోతుంది. ప్రవీణ్ కుమార్ ఆయన ఎజెండా చెప్పాలి!. అర్థం…
ఈఏడాది కూడా స్వాతంత్ర్యదినోత్సవాన్ని గోల్కొండ కోటలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్… ఇవాళ బీఆర్కే భవన్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎస్.. స్వాతంత్ర్యదినోత్సవం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ…
కరీంనగర్ జిల్లా.. జమ్మికుంట పట్టణంలోని ఎంపిఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… దేశానికి దిక్సూచి దళిత బంధు పథకం. గత ప్రభుత్వాలు దళితులను కేవలం ఓటు బ్యాంక్ కోసం మాత్రమే చూశారు. దళితుల దారిద్రయాన్ని పోగెట్టెందుకు ఏ ప్రభుత్వం కృషి చేయలేదు. ఒక దళిత కుటుంబానికి నేరుగా రూ.10లక్షలు ఖాతాలో వేయడం సంతోషకరమైన విషయం అన్నారు. రూ.500కోట్లు కేవలం మొదటి వీడుత మాత్రమే. రాష్ట్ర…
షర్మిల పార్టీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. రాజయ్య ఖండించాడు. వైఎస్సార్ అంటే తనకు అభిమానమని.. తెలంగాణ మూమెంట్ లో జగన్మోహన్ రెడ్డినా..? తెలంగాణనా అంటే..? తెలంగాణనే అని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రాజయ్య తెలిపారు. నా జీవితాంతం టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా.. సోషల్ మీడియాలో నాపై తప్పుడు వార్తలు రాశారు. లోటస్ పాండ్ దగ్గర అనిల్ కుమార్ ను నేను కలిసినట్లు అసత్య ప్రచారం చేశారు. గతంలో ఓ క్రైస్తవ…
రెండున్నరేళ్ల లో తెలంగాణ లో దళితుల అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు చేస్తాం. వచ్చే సంవత్సరం దళిత బంధు క్రింద బడ్జెట్ లో రూ.30 వేల కోట్లు కేటాయిస్తాం అని తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు అన్నారు. దళిత బంధు తో తమ కాళ్ళమీద తాము నిలబడేలా నిధులను సద్వినియోగం చేసుకోవాలి. రైతు బంధు మాదిరే దళిత బంధు దేశానికి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తుంది. దళిత జాతికి సరికొత్త దశా దిశా చూపే కార్యక్రమం దళిత…
ఆదివాసీ లను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి లో ఎలా సభ పెడుతుంది అని ఆదివాసీ హక్కుల పోరాట సమితి ప్రశ్నించింది. మా పండగ రోజు రాజకీయ సభకు ఎలా అనుమతి ఇచ్చారు.. ఏదైనా జరిగితే కాంగ్రెస్ పార్టీ , రాష్ట్రప్రభుత్వందే భాద్యత అని తెలిపింది. ఆదివాసీలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కే రెండు సార్లు మోసం చేసింది. ఇప్పుడు మూడో సారి మా ఆదివాసీ దినోత్సవాన్ని హైజాక్ చేస్తోంది. 1976 లో కాంగ్రెస్ పార్టీ…
బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… తెలంగాణ సీఎం కేసీఆర్ను తొలిరోజే టార్గెట్ చేశారు.. నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ‘రాజ్యాధికార సంకల్ప సభ’లో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో బీఎస్పీ కండువా కప్పుకున్న ఆయనకు తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు.. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా మారాలని ఆకాంక్షించారు. ఏళ్ల తరబడి అలాగే ఉన్న అసంపూర్తి ఆకాంక్షలు, ఆశలను…
ట్రాఫిక్ చలానాలు ఇప్పుడు సామాన్యులను భారంగా మారుతున్నాయి… వరుసగా వస్తున్న ట్రాఫిక్ చలానాలు భరించలేక ఓ యువకుడు ఏకంగా తన బైక్పై పెట్రోల్ పోసి తగలబెట్టడం కలకలం సృష్టిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన తలారి రత్నప్ప తనయుడు సంగప్పకు టీఎస్ 34 డీ 2183 నంబర్ గల బైక్ ఉంది.. ఆ ద్విచక్రవాహనంపై 5,500 రూపాయలు చలానాగా ఉంది. బైక్ పై కూలి పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాలకు…
ఓ మాయలేడీ వలలో పడి న్యూడ్ వీడియో, ఫోటోలతో మోసపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని కొంపల్లి సినీ ప్లానెట్ సమీపంలోని ఓ యువకుడికి గత నెల 30న తన మొబైల్ వాట్సాప్ కు ఓ నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. ఆ నెంబర్ అమ్మాయిదని తెలియడంతో సరదాగా చాటింగ్ సాగించాడు. ఆ పరిచయం పెరగడంతో యువకుడు ఆమె అడిగిన వెంటనే తన ఫేస్ బుక్ ఐడిని షేర్ చేశాడు.…