గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : సీడ్ గణపతులను పంపిణీ చేసిన ఎంపీ సంతోష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పర్యావరణ అవగాహన, పచ్చదనం పెంపులో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినాయక చవితి సందర్భంగా సీడ్ గణేషాను పంపిణీచేస్తోంది. ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్, పంజాగుట్ట సమీపంలో ఉన్న నెక్ట్స్ గలేరియా మాల్ లో సందర్శకులకు ఎం.పీ చేతులు మీదుగా విత్తణ గణపతులను పంపిణీ చేశారు. పూర్తిగా పర్యావరణహితంగా గణేష్ ప్రతిమలను తయారు చేయటం ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ స్ఫూర్తివంతమైన కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు ప్రకటించారు. స్వచ్చమైన మట్టి, కొబ్బరి నాచు (కోకో పౌడర్) ను వాడుతూ ప్రతిమలను తయారు చేశారు.
ఈ సారి గణేష్ ప్రతిమలతో పాటు వివిధ రకాల విత్తనాలును మట్టిలో పొందుపరిచారు. హరిత తెలంగాణ సాధనలో చింత, వేప చెట్లను విరివిగా పెంచాలన్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఆశయం మేరకు ఆ విత్తనాలతో కూడిన మట్టి గణేషులను తయారు చేసి, పంపిణీ చేస్తున్నట్లు ఎం.పీ సంతోష్ కుమార్ వెల్లడించారు. అలాగే పెద్ద సంఖ్యలో ఔషధ మొక్కల అవసరాన్ని గుర్తించి, వాటి విత్తనాలతో కూడా సీడ్ గణేషాల తయారీ, పంపిణీ కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా పెరుగుతున్న కాలుష్యం తద్వారా జరుగుతున్న పర్యావరణ నష్టాన్ని తగ్గించాలన్న తలంపుతో విత్తన గణపతుల పంపిణీకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు వచ్చినట్లు ఎం.పీ తెలిపారు.
Also Read
ప్రతీ యేటా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని, ప్రజలు- భక్తులు వీలైనంత వరకు మట్టి ప్రతిమలను కొలిచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు నిచ్చారు. తద్వారా వాటి తయారీదారులకు ఉపాధి, పర్యావరణహితం అనే రెండు లక్ష్యాలు నెరవేరుతాయని ఎం.పీ అన్నారు. పచ్చదనం పెంపుతో పాటు, పర్యావరణ రక్షణకు వీలైనన్ని చర్యలు తీసుకోవటంలో ప్రతీ ఒక్కరూ తగిన అవగాహనతో వ్యవహరించాలని కోరారు. నెక్ట్స్ గలేరియాలో ఈ కార్యక్రమం నిర్వహణకు ముందుకు వచ్చిన మాల్ మేనేజ్ మెంట్ ను ఎంపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, గో రూరల్ సంస్థ సీఈవో సునీల్, టీ న్యూస్ సీజీఎం ఉపేందర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!