తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 482 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 455 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,50,835కు చేరుకోగా… ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 3,833కు పెరిగింది.. ఇక,…
గత కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనను ఎట్టకేలకు పూర్తి చేసింది కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యుల టీమ్.. కర్నూలు జిల్లాలో పర్యటించిన కేఆర్ఎంబీ.. ముచ్చుమర్రి ఎత్తిపోతలను పరిశీలించిన తర్వాత పోతిరెడ్డిపాడు సమీపంలోని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా పరిశీలించింది. కృష్ణా నది జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించి నివేదిక సమర్పించాలంటూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ టీమ్…
టీఆర్ఎస్ పార్టీ కి ఇంద్రవెల్లి సభతో చురుకు తగిలింది. కలుగులో నుంచి ఒకొక్కరు బయటకు వస్తున్నారు అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉండి… నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు సరికాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు కత్తులు…కటారులు పట్టుకుని తిరుగుతున్నారా…నాలుకలు కోస్తాం అంటున్నారు.. మాకు కత్తులు దొరకవా…. మేము నాలుకలు కోయలేమా. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం…. మీరు జైలుకు వెళ్లడం తథ్యం అని తెలిపారు. ఇప్పుడు ప్రతి పక్షంగా…. మేము ప్రశ్నిస్తాము. వివరణ ఇచుకోవాల్సిన బాధ్యత…
విద్యార్థులు, విద్యా విధానంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది కరోనా మహమ్మారి.. స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు మూతపడి.. ఆన్‌లైన్‌కే పరిమితం అయ్యేలా చేయడమే కాదు.. ఎన్నో పరీక్షలను కూడా రద్దు చేసింది.. కీలకమైన బోర్డు ఎగ్జామ్స్‌కు రద్దు చేసి.. అందరు విద్యార్థులను పాస్ చేసిన పరిస్థితి.. అయితే, ఈ తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ… ఎంసెట్ అడ్మిషన్స్, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా, 5 సంవత్సరాల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్ కి అర్హత.. ఇంటర్…
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో దళిత బంధు పథకాన్ని తెరపైకి తెచ్చింది ప్రభుత్వం.. హుజురాబాద్ కంటే ముందుగానే… సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఈ పథకాన్ని అమలుకు పూనుకున్న సర్కార్.. ఇప్పటికే నిధులు కూడా విడుదల చేసింది.. అయితే, దళిత బంధు ప్రకటించిన తర్వాత.. రకరకాల బంధులు తెరపైకి వస్తూనే ఉన్నాయి.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వి. హనుమంతరావు… దళితులకు దళిత బంధు…
నాకు కేవలం 2 గుంటల భూమే ఆస్తి.. ఓ పని మనిషిలా పని చేస్తా.. అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాలని హుజురాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో.. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్.. స్వాగత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… నాకు టికెట్ ఇచ్చి హుజురాబాద్ ప్రజలకు సేవ చేయమన్న సీఎం కేసీఆర్ కి పాదాభివందనం అన్నారు.. నేను పేద కుటుంబంలో పుట్టిన బిడ్డను.. విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో పని చేశాను……
కేసీఆర్ రా.. దమ్ముంటే నాపై పోటీ చేయి.. హరీష్‌రావు రా.. ధైర్యం ఉంటే నాపై పోటీ చేయాలి అంటూ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విసిరిన సవాల్‌కు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.. తాజాగా హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా.. హుజూరాబాద్ లో స్వాగతం చూస్తే గెల్లు శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలువబోతున్నాడని అర్థమవుతోందన్నారు.. ఎన్నికలు వచ్చినప్పుడు గెలిస్తే ఏం చేయాలో చెప్పాలి.. కానీ, బీజేపీ…
ప్రభుత్వ విప్ ,అచ్ఛంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై ఫైర్ అయ్యారు నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి లో ఆయమా మాట్లాడుతూ… తెరాస ఎమ్మెల్యే లు మంత్రులు రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాం. సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి ని దళిత మంత్రులు, దళిత ఎమ్మెల్యేలు ఎందుకు సీఎం ని…
అక్కడి అధికారపార్టీలో ముసలం పుట్టింది. ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. నియోజకవర్గంలో పట్టుకోసం ఒకరు.. పట్టుసడలకుండా మరొకరు రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. వారెవరో.. ఏం చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం టికెట్ కోసం ఇప్పటి నుంచే ఎత్తుగడలు! గద్వాల. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నడిగడ్డగా పిలవబడే ప్రాంతం. అక్కడి రాజకీయం ఓ పట్టాన అంతుబట్టదు. రాష్ట్ర రాజకీయం అంతా ఒకలా ఉంటే గద్వాల పాలిటిక్స్ మరోలా ఉంటాయి. ఏదో ఒక రాజకీయ రగడ కామన్.…