తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది… మంత్రి మల్లారెడ్డి విసిరిన సవాల్‌కు స్పందిస్తూ.. మల్లారెడ్డికి కాదు.. సీఎం కేసీఆర్‌కే నా సవాల్.. అసెంబ్లీ రద్దు చేసి రావాలి ఎన్నికలకు వెళ్దామని ప్రకటించాడు రేవంత్‌రెడ్డి.. ఇక, అంతేకాదు.. మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ.. కొన్ని పత్రాలను కూడా మీడియాకు చూపించారు.. అయితే, తాజాగా రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇస్తూనే.. ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి మల్లారెడ్డి.. తాను ఎంపీ…
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తనపై చేసిన భూ కబ్జా ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి… శుక్రవారం రోజు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించిన మల్లారెడ్డి.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తన దగ్గర ఉన్న ఆధారాలను బయటపెట్టారు.. రేవంత్ ఎంపీగా గెలిచినప్పటి నుంచి తనను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.. ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్‌లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..
సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారా ? లేదా ? అని చార్మినార్ వేదిక నుండి కేసీఆర్ కి సవాల్ విసురుతున్నానని తెలిపారు. బండి సంజయ్ పాదాయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పాత బస్తి కి మెట్రో రైలు రాక పోవడానికి కారణం ఒవైసీ అని… పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండి పడ్డారు. హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు…
తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతోంది.. మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఆయన బామ్మర్ది మద్దుల శ్రీనివాస్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు.. ఆయనపై కూడా కబ్జా ఆరోపణలు చేశారు.. ఇక, రేవంత్ రెడ్డి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు శ్రీనివాస్‌రెడ్డి.. ఆయన ఆరోపణలు అవాస్తవం అని కొట్టిపారేశారు.. నన్ను ఉప సర్పంచ్ అని అన్నావ్… కానీ, నేను సర్పంచ్ గా పనిచేసాను అని తెలుసుకోవాలని సూచించారు.. మల్లారెడ్డికి…
ఎక్కడ రాజీపడకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తున్నాం.. చక్కగా కాపాడుకోవాలి.. పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు మంత్రి కేటీఆర్.. మలక్‌పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు బస్తీలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జంగంమెట్, బండ్లగూడ, ఫారూఖ్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసి పేద ప్రజలకు అందజేస్తామన్నారు. పిల్లిగుడిసెల బస్తీలో ఒకప్పుడు మంచినీళ్ల గోస ఉండేది. డ్రైనేజీ సరిగా లేక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు…
ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు… ఈ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేసింది… రేవంత్‌రెడ్డితో పాటు.. అప్పటి టీడీపీ.. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కూడా సమన్లు జారీ అయ్యాయి.. ఈడీ కేసులను విచారించే నాంపల్లి ఎంఎస్ జే కోర్టు నుంచి ఈ సమన్లు జారీ అయ్యాయి… అక్టోబరు 4వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ…
దీక్షకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు… రేపు బేగంపేటలోని తన నివాసంలో ఒకరోజు దీక్షకు దిగనున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటన ప్రకారం.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై నిరసన తెలియజేయనున్నట్టు పేర్కొన్నారు.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ప్రకటనలో పేర్కొన్న మోత్కుపల్లి… దళిత సాధికారితకోసం సభలు, సమావేశాలు నిర్వహించి దళితుల సంక్షేమం కోసం, దళితుల అభ్యున్నతి కోసం ఉపన్యాసాలు ఇవ్వడం,…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకానికి ఆగస్ట్ 16న శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. హుజురాబాద్‌లో పర్యటించి మరీ… ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధును ప్రారంభించారు. ముందుగా అర్హులైన 15 కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు ముఖ్యమంత్రి. అయితే… తాజాగా దళితబంధు ఇంటింటి సమగ్ర సర్వే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం ప్రారంభమైంది. సర్వే కోసం దళితవాడలకు వచ్చిన…
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. అందులో ఇటీవలే పెళ్లి అయిన ఓ మహిళ ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. నిర్మల్ జిల్లా కడెం మండలం పాండవ పూర్ బ్రిడ్జి వద్ద అదుపు తప్పి.. కారు బోల్తా కొట్టింది. అయితే… ఆ కారులో ప్రయాణిస్తున్న పెండ్లి కూతురు మౌనిక మరియు పెండ్లి కూతురు తండ్రి రాజాం అక్కడిక్కడే మృతి చెందారు.…
తీన్మార్ మల్లన్న అరెస్ట్ అయ్యారు. మల్లన్న అలియాస్ చింత పండు నవీన్ ను అర్థరాత్రి అరెస్ట్ చేశారు చిలకలగూడ పోలీసులు. తీన్మార్ మల్లన్న తనను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు లక్ష్మీకాంత్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ. 30 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసాడని, ఇవ్వక పోయేసరికి తనను బ్లాక్ మెయిల్ చేశాడంటూ ఫిర్యాదు చేశాడు జ్యోతిష్య నిపుణులు లక్ష్మీకాంత్ శర్మ. ఈ మేరకు ఇప్పటికే తీన్మార్ మల్లన్న…