సింగరేణి కాలనీకి విజయమ్మ.. షర్మిలతో పాటు దీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి ఘటన అందరినీ కలచివేస్తోంది.. ఇప్పటికే చాలా మంది నేతలు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి, ధైర్యాన్ని చెప్పగా… ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అక్కడే దీక్షకు దిగారు.. అయితే, రాత్రికి సింగరేణి కాలనీకి చేరుకున్నారు వైఎస్ షర్మిల.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె.. షర్మిలతోపాటు దీక్షలో కూర్చున్నారు. కాగా, ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల.. బాధిత కుటుంబానికి రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించే వరకు దీక్షలో కూర్చుంటానన్నారు.. నిందితుడికి ఉరిశిక్ష వేయిస్తారా..? ఎన్ కౌంటర్ చేస్తారా..? ఏదైనా వెంటనే చేయాలి. మీ ఇంట్లో కుక్క పిల్లలు చనిపోతే అధికారులపై చర్యలు తీసుకున్నారు. మరి.. అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు పోతే నీలో చలనం లేదు. నీకు మానవత్వం లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. ఇప్పుడు విజయమ్మ కూడా ఆమెతోపాటు దీక్షకు కూర్చోవడంతో ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా మారింది. కాగా, నిందితుడిని ఇంకా పట్టుకోకపోవడంపై ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి. మరోవైపు.. నిందితుడి వేటను ముమ్మరం చేశారు పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను అలెర్ట్ చేశారు.
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!