ప్రజా సంగ్రామ యాత్ర లో ప్రజలు తమ బాధలని చెప్పుకుంటున్నారు. నిర్మల్ లో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భగా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అమిత్ షా రేపు నిర్మల్ బహిరంగ సభ లో పాల్గొంటారు. ప్రజా సంగ్రామ యాత్ర లో చాల మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాధలు చెప్తున్నారు. జీతాలు కూడా సరైన సమయం లో ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోంది ప్రభుత్వం. సెంటిమెంట్ పేరుతో ప్రజల్లో ఆవేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లు… నియామకాల విషయం లో తెలంగాణ కి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు అని తెలిపారు.
ఇక కేంద్రం నుండి తెలంగాణ వచ్చిన నిదుల పై వివరాలు విడుదల చేసిన సంజయ్… పన్నుల వాటా కింద లక్ష 4వేల 715 కోట్ల రూపాయలు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది. లక్ష 22వేల కోట్ల రూపాయలను కొన్ని సంక్షేమ పథకాలకు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది. దీనికి అదనంగా రహదారుల కోసం 40 వేల కోట్లు మంజూరు చేసి ..21 వేల కోట్లు విడుదల చేసింది. రైల్వే నిర్మాణల కోసం మరో 23వేల 491 కోట్లు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది. కరోనా లాంటి విపత్తు నిర్వహణ లో వ్యాక్సిన్ ల కోసం 2వేల 7వందల కోట్లు రాష్ట్రానికి వచ్చాయి. ఇలా మొత్తం 2లక్షల52వేల9 కోట్లు కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చాయి. UPI హయంలో రాష్ట్రానికి ఇచ్చిన నిదుల కంటే 9 శాతం పెంచింది NDA సర్కార్. ఈ లెక్కలు నిజామా కాదా అని సీఎం కేసీయార్ చెప్పాలి అని పేర్కొన్నారు.