తెలంగాణలో పాదయాత్ర పర్వం మొదలైంది.. ఈ జాబితాలో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేరిపోయారు.. రేపటి నుండి ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నారు బండి సంజయ్.. అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన విముక్తి కోసం తన పాదయాత్ర అని ప్రకటించారు.. రేపు హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించనున్నారు సంజయ్… అక్టోబర్ 2వ తేదీ వరకు మొదటి విడత పాద యాత్ర…
ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం మొదలైంది… మంత్రి మల్లారెడ్డి భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలంటూ సీఎం కేసీఆర్కు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సవాల్ విసిరారు.. ఇక, రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మల్లారెడ్డి.. తొడగొట్టి మరీ సవాల్ విసిరారు.. తాను మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా… దమ్ముంటే రేవంత్రెడ్డి.. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఎన్నికలకు వెళ్దామని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇక, మంత్రి మల్లారెడ్డి సవాల్, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా ఉన్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 357 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్కరు మృతిచెందారు.. ఇక, 405 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,56,455 కు చేరగా.. రికవరీ కేసులు 6,46,344 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,865 గా ఉంది..…
కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… నన్ను చూస్తే గజగజ వణుకుతున్నారు. నా సభలకు కరెంట్ కట్ చేస్తున్నారు. అదే నేను అధికారంలోకి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ కి కరెంట్ చేస్తా అని తెలిపారు. హుజురాబాద్ ఎన్నిక వస్తేనే దళితుల మీద ప్రేమ పుట్టుకు వచ్చింది. ట్రాక్టర్లకు ఓనర్లు కాదు.. కంపెనీలకు ఓనర్లను చెయ్యాలి. అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారు. మంత్రి హోదాలో ఉండి.. తొడ గొట్టి మాట్లాడతారా. మీ కాలేజీల్లో విద్యార్థులకు…
చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పూర్తి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలల నిర్వహణ ఉంటుంది. అన్ని కోణాల్లో ఆలోచించి, చర్చించి, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాలల పునః ప్రారంభానికి నిర్ణయించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాము, ఇక నుండి ఆఫ్ లైన్ లో తరగతులు ఉంటాయి. వైద్య శాఖ నివేదిక ప్రకారమే సెప్టెంబర్…
యాదాద్రి జిల్లా తుర్కపల్లి(మ) రాంపూర్ తండా దళిత – గిరిజన దండోరా దీక్ష లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడో, బలహీన వర్గాలకు చెందిన వాళ్లే ముఖ్యమంత్రి. వాసాలమర్రి కి సీఎం కేసీఆర్ ఎప్పుడు వచ్చిన అడ్డుకుంటాం. దళిత బంధుతో ముఖ్యమంత్రి కేసీఆర్ బొంద తొడుకుండు ఆ బొంద మేమే పుడుస్తాం. సీఎంఓ రాహుల్ బోజ్జ చోటు ఇవ్వగానే దళితలందరికి ఇచ్చినట్టా అని ప్రశ్నించారు.…
ఐదారేళ్ల గ్యాప్ తర్వాత టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకం దేనికి సంకేతం? జిల్లాల్లో ఎవరికైనా కత్తెర పడబోతుందా? నిన్నమొన్నటి వరకూ తామే సుప్రీం అనుకున్నవారికి చెక్ పడినట్టేనా? గులాబీ పెద్దల ఆలోచనలో వచ్చిన మార్పునకు కారణం ఏంటి? అధికారపార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకానికి నిర్ణయం! టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పార్టీ వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి.పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా…
తెలంగాణ పోలీస్ శాఖ లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం లో 19 మంది డీఎస్పీ లు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న జి. హనుమంత రావును కూకట్ పల్లి ట్రాఫిక్ ఏసీపీ గా బదిలీ చేశారు. ఇక ఇప్పటి వరకు కూకట్ పల్లి ట్రాఫిక్ ఏసీపీ…
జేఈఈ మెయిన్ చివరి విడత(నాలుగు) పరీక్షలు దేశవ్యాప్తంగా గురువారం మొదలుకానున్నాయి. ఈ నెల 26, 27, 31, సెప్టెంబరు 1, 2వ తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొదటి రోజు బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత నుంచి బీటెక్ కోసం పేపర్-1 నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 7.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత దేనిలో అధిక స్కోర్ వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకొని…
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి చామకూర మల్లారెడ్డి పై కాంగ్రెస్ నేతలు మరియు కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యం లోనే బోయినిపల్లి లో ఉన్న మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు దళిత కాంగ్రెస్ నాయకులు. దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్ ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే.. ఈ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దళిత కాంగ్రెస్ నాయకులు మరియు పోలీసుల…