తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 73,323 శాంపిల్స్ పరీక్షించగా.. 324 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మహమ్మారిబారినపడి మరొకరు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో.. 280 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,526కు చేరగా.. రికవరీ కేసుల సంఖ్య 6,53,302కు పెరిగింది.. కోవిడ్‌తో మరణించినవారి సంఖ్య 3,899కు చేరిందని.. ప్రస్తుతం రాష్ట్రంలో 5,325 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. తాజాగా కేసులో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 79 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఖమ్మంలో 24, కరీంనగర్‌లో 22 కొత్త కేసులు వెలుగుచూశాయి.