LPG Booking Messages Without Booking: గ్యాస్ ఏజెన్సీల గోల్మాల్..! LPG బుక్ చేయకుండానే.. బుక్ చేసినట్టు మెసేజ్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Booking Messages Without Booking: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది.. ముఖ్యంగా విజయవాడలోని గ్యాస్ ఏజెన్సీపై గోల్మాల్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కస్టమర్లు బుక్ చేయకుండానే గ్యాస్ సిలిండర్ బుక్ అయినట్లు మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు వస్తుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని సాయిరామ్ థియేటర్ సమీపంలో ఉన్న భారత్ గ్యాస్ కు చెందిన తరుణీ శ్రీ భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
బుక్ చేయకుండానే మెసేజ్‌లు
కొంతమంది వినియోగదారుల ఫోన్లకు తాము గ్యాస్ బుక్ చేయకపోయినా బుకింగ్ అయినట్లు మెసేజ్‌లు రావడంతో వారు ఏజెన్సీకి వెళ్లి వివరాలు అడిగారు. అయితే ఈ విషయానికి తమకు సంబంధం లేదని ఏజెన్సీ సిబ్బంది సమాధానం ఇస్తున్నారని కస్టమర్లు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్లు ప్రస్తుతం అందుబాటులో లేవని, ఏప్రిల్‌లో సరఫరా అవుతాయని అప్పటివరకు వేచి ఉండాలని ఏజెన్సీ సిబ్బంది చెబుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
Also Read
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
- Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
ఏజెన్సీ వద్ద భారీ క్యూలు
ఈ పరిణామాలతో గ్యాస్ ఏజెన్సీ వద్ద వందలాది మంది కస్టమర్లు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. సిలిండర్ల కోసం పెద్ద ఎత్తున క్యూలు కనిపించాయి. మరోవైపు.. కస్టమర్ల పేర్లతో గ్యాస్ సిలిండర్లు బుక్ చేసి వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని కొంతమంది వినియోగదారులు ఏజెన్సీపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
-
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
ట్రెండింగ్
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!