కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసరడం హాట్ టాపిక్ అయ్యింది.. ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో సవాల్ చేసిన ఆయన నిరూపించలేకపోతే రాజీనామాకు సిద్ధమా? అని ప్రశ్నించారు.. అయితే, దీనికి అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.. యూపీఏ ప్రభుత్వం కంటే ఎన్డీఏ ప్రభుత్వం 9 శాతం నిధులు అధికంగా రాష్ట్రానికి ఇచ్చిందన్న ఆయన.. సీఎం కేసీఆర్ వస్తే ఇద్దరు మోడీ దగ్గరకు వెళ్లి రాజీనామా చేస్తాం అన్నారు. కేటీఆర్‌ను ఎవరు పట్టించుకుంటారు.. కేసీఆరే రాజీనామా చేయాలన్నారు. పన్నుల విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి చట్టం ఉంటుంది.. కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగిడినట్లు లీకులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. తాజా ఎన్టీవీతో మాట్లాడిన బండి సంజయ్.. సీఎం కేసీఆర్ నాతో ఢిల్లీకి వస్తే నేను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.. నిధుల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీతో నేనే అపాయింట్‌మెంట్ తీసుకుంటానన్న ఆయన.. ప్రధాని ముందే రాష్ట్రానికి ఎన్ని ఇచ్చాం.. ఎన్నీ సంక్షేమ పథకాలు.. ఎన్ని అందుతున్నాయో తేలుద్దాం అన్నారు. ఈ సవాల్ కి సిద్ధమైతే ప్రధాని ముందే రాజీనామాకి సిద్ధమని ప్రకటించారు బండి సంజయ్ కుమార్..