సింగరేణికాలనీకి పవన్ కల్యాణ్.. చిన్నారి కుటుంబానికి ఓదార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, వివిధ సంఘాల నేతలు.. సినీ నటుడు మంచు మనోజ్ తదితరులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చగా.. ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సింగరేణి కాలనీకి వెళ్లారు.. ఆరేళ్లబాలికపై హత్యాచారం ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పవన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.. దీంతో.. అపవన్ కల్యాణ్ కారు దిగడం కూడా సాధ్యపడని పరిస్థితి నెలకొంది.. ఈ సందర్భంగా అభిమానుల మధ్య తోపులాట జరిగింది.. ఇక, చిన్నారి ఇంటి దగ్గరకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. కారు వద్దకే ఆ కుటుంబాన్ని పిలిచి మాట్లాడారు పవన్ కల్యాణ్.
ఆరేళ్ల చిన్నారి చైత్ర కుటుంబ సభ్యులతో మాట్లాడిన పవన్.. జరిగిన ఘటనకు సంబంధించి విషయాలను అడిగి తెలుసుకున్నారు.. ఆ కుటుంబాన్ని ఓదార్చారు.. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జనసేనాని.. చాలా కలచివేసే సంఘటన ఇది.. ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణం సభ్యసమాజంలో చెప్పుకోలేని విధంగా జరిగిందన్నారు.. ఆడుకోవడానికి వెళ్లిన బిడ్డ కనిపించకుండా పోవడంతో.. ఆ కుటుంబం అల్లాడిపోయిందని.. అంతా వెతికినా కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారన్నారు. కానీ, ఆ చిన్నారి శవమై కనిపించడం అందరినీ కలచివేస్తోందన్నారు పవన్.. ఇలాంటి ఘటనలు రిపీట్‌గా జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. ఇక, ఇప్పటి వరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఇప్పటికైనా న్యాయం జరగాలి.. దయజేసి ప్రభుత్వ పెద్దలు.. సంబంధిత మంత్రులను పంపించి.. ఆ కుటుంబానికి భరోసా ఇవ్వండి.. వారికి ఓదార్పు కల్పించండి అని సూచించారు.. బాధిత కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయాలో ఆలోచించాలన్న పవన్.. బిడ్డను కోల్పోయినవారి మనోభావాలు వేరుగా ఉంటాయని.. వాటిని అర్థంచేసుకోవాలన్నారు.. ఇక, ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!