ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు జడ్జి జస్టిస్ సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ ను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సీబీఐ స్పెషల్ కోర్టు-1 అదనపు జడ్జిగా వరప్రసాద్ కు బాధ్యతలు అప్పగించింది న్యాయస్థానం… ఇక, ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల కోర్టు న్యాయమూర్తిగా కె.జయకుమార్ ను నియమించింది. జస్టిస్ జయకుమార్ ప్రస్తుతం వరంగల్ ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.. మరోవైపు.. తెలంగాణ…
హైదరాబాద్ శివార్లలోని చేవెళ్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. మృత్యువులోనూ వీడని స్నేహబంధం ఆ మిత్రుల ఆనందాన్ని చూసి.. విధికి కన్ను కుట్టిందో ఏమో.. అప్పటి దాకా ఆనందోత్సాహాలతో గడిపిన ముగ్గురు మిత్రులు అంతలోనే విగత జీవులయ్యారు. ఫ్రెండ్ బర్త్ డే కు కేక్ కోసమని. .బైక్…
కరీంనగర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకంపై సమీక్ష నిర్వహించారు.. ఇక, సమీక్ష తర్వాత హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయిన తెలంగాణ సీఎం.. సిద్దిపేట జిల్లాకు రాగానే మల్లన్న సాగర్ ప్రాజెక్టును పరిశీలించారు.. తొగుట మండలం తుక్కుపూర్ లో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను హెలికాప్టర్ నుంచి వీక్షించారు.. కాగా, ఇప్పటికే ఆరు మోటార్ల ద్వారా మల్లన్న సాగర్ లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు.. ఈ ఏడాది పది టీఎంసీల…
తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. గత బులెటిన్‌తో పోలిస్తే.. తాజా బులెటిన్‌లో కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 80,568 శాంపిల్స్ పరీక్షించగా… 339 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 417 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో… మొత్తం పాజిటివ్…
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కావడంతో.. హైకోర్టు సీజే పోస్టు ఖాళీ ఏర్పడింది.. దీంతో.. ఎంఎస్ రామచంద్రరావును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్ర న్యాయశాఖ. తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయిలో కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చే వరకు.. బాధ్యతలు నిర్వహించనున్నారు ఎంఎస్ రామచంద్రరావు. కాగా, సుప్రీంకోర్టుకు కొత్తగా 9…
తెలంగాణ ఆర్టీసీని సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ సెట్ చేస్తారా? పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ముద్రపడ్డ ఆయన్ని ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీకి పంపింది? ఎవరికి చెక్ పెట్టేందుకు తీసుకొచ్చారు? ఆర్టీసీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? సీనియర్ ఐపీఎస్‌తో మంత్రికి సఖ్యత కుదురుతుందా? తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు MDగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ వచ్చారు. ఈ నియామకంపై ఆర్టీసీతోపాటు.. ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీకి పూర్తిస్థాయి MD…
మంత్రి మల్లారెడ్డి రాజీనామా సవాల్ చివరకు సీఎం కేసీఆర్ పైకి మళ్లింది… గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మల్లా రెడ్డిపై మరోసారి భూ కబ్జా, అవినీతి, అక్రమ ఆరోపణలు చేశారు.. ఈ సందర్భంగా ఇవిగో ఆధారాలంటూ కొన్ని పత్రాలను కూడా బయటపెట్టారు.. ఇక, ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి రాజీనామా సవాల్‌పై స్పందించిన ఆయన.. సవాల్ మల్లారెడ్డికి కాదు.. కేసీఆర్‌కే విసురుతున్నా అన్నారు.. నేను గెలిచిందే మల్లారెడ్డి మీద కదా? అని ప్రశ్నించారు..…
మొన్న మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఇవాళ వాటికి సంబంధించిన ఆధారాలంటూ కొన్ని పత్రాలను మీడియా ముందు బయటపెట్టారు.. సహచరులపై అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ చెప్పారన్న ఆయన.. అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించనని గతంలో ఇద్దరు మంత్రులపై వేటు కూడా వేశారని గుర్తుచేశారు. మంత్రి మల్లారెడ్డిపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న రేవంత్.. తాను మల్లారెడ్డి అవినీతిపై ఆధారాలిచ్చానని పేర్కొన్నారు. ఓ రియల్ ఎస్టేట్…
పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్.. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం ప్రకారం సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్2 న 12,769 పంచాయితీలు, 142 మున్సిపాలిటీలలో కమిటీల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.. సెప్టెంబర్ 12లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆయన.. పార్టీ జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గం ఏర్పాటు చేయాలని.. సెప్టెంబర్ 20 తర్వాత రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు…