ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే. స్కూళ్లు తెరవాలన్న నిర్ణయం బాగానే ఉన్నా.. ఆ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలే సర్పంచ్‌లకు టెన్షన్ పెడుతున్నాయట. చేతిలో చిల్లిగవ్వ లేదు.. ప్రభుత్వం నుంచి పైసా రాదు. స్కూళ్లు సాఫ్ చేయకపోతే.. జేబులు సఫా. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదట సర్పంచ్‌లకు. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రభుత్వ ఆదేశాలతో సర్పంచ్‌లు ఉలికిపాటు! తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. విద్యార్థులకు తరగతి…
తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 325 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 424 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,119 కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,47,185 కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,869 కు…
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండి పడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకోసం పాదయాత్ర చేపడుతున్నాడు, ముందు తమ పార్టీ తెలంగాణ కు ఏమి ఇచ్చిందో చెప్పి పాద యాత్ర చేయాలని అన్నారు. సస్యశ్యామలం అయిన తెలంగాణలో అలజడులు సృష్టించేందుకు కొన్ని శక్తులు యాత్రల పేరుతో బయలుదేరాయని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలను దోచుకొని తింటున్న బీజేపీ పార్టీ…
అధికారపార్టీలో ఇప్పుడా పదవికి డిమాండ్ పెరిగింది. భవిష్యత్‌లో రాజకీయ పదోన్నతులకు లాంఛింగ్ ప్యాడ్‌గా ఉపయోగపడుతుందని లెక్కలేస్తున్నారట. పైగా సెంటిమెంట్‌గానూ భావిస్తున్నారు నాయకులు. ఇంతకీ ఆ పదవేంటి? ఎందుకు సెంటిమెంట్‌గా చూస్తున్నారు? టీఆర్ఎస్వీ పోస్ట్ పదవులకు లాంఛింగ్ ప్యాడా? హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస యాదవ్ పేరును ప్రకటించగానే TRSVపై పార్టీ వర్గాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. TRSV టీఆర్ఎస్ విద్యార్థి విభాగం. ఆ సంస్థకు గెల్లు శ్రీనివాసే అధ్యక్షుడు. ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి…
హుజురాబాద్ దళితభాధితుల సంగం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ ఈటల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. నియోజక వర్గంలో నలుగురు చావులకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరోక్షంగా బాద్యుడు అతనిపై హత్య యత్నం కేసు నమోదు చేయాలి. కమలపూర్ మండలంలో ఉప సర్పంచ్ సుధాకర్ శిలాఫలకం ధ్వంసం చేశాడని కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి పోలీస్ స్టేషన్ నుండి విడుదల అయిన తరువాత నెలకే ఆక్సిడెంట్ లో మృతిచెందడం ఆంతర్యమేమిటి అని అన్నారు. కమలపూర్ మండలం…
తెలంగాణ బీజేపీ అశ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం ప్రజా సంగ్రామ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మాట్లాడుతూ… బీజేపీ చేసేది ప్రజా సంగ్రామ యాత్ర కాదు- ప్రజా సంకట యాత్ర అన్నారు. తెలంగాణ సాదించుకుంది కుక్కలు- నక్కలలాంటి వ్యక్తులతో తిట్టిపించుకోవడానికా అని ప్రశ్నించారు. బండి సంజయ్ పాదయాత్ర తెలంగాణలో కాదు- మోడీ సొంతరాష్ట్రం గుజరాత్ లో చెయ్యాలి. బీజేపీ కి అధికారం కావాలంటే ఆ…
అసలే కరోనా సమయం.. బతకడమే కష్టంగా మారింది.. ఎన్నో ఉద్యోగాలు ఊడిపోయాయి.. ఉపాధిపై కరోనా ఘోరంగా దెబ్బకొట్టింది. ఈ సమయంలో.. ఈఎంఐలు కట్టడం కష్టంగా మారిన పరిస్థితి.. కానీ, ఓ ఆటో డ్రైవర్‌కు ఫైనాన్స్ కంపెనీల వేధింపులు ఎక్కువయ్యాయి.. మరోవైపు పోలీసుల వేధింపులు పెరిగాయని.. పెట్రో ధర భారం కూడా పడిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్.. తాను ఫైనాన్స్‌లో తీసుకున్న ఆటోపై పెట్రోల్ పోసి నిప్పటించాడు.. ఈ ఘటన హన్మకొండలోని కాళోజీ జంక్షన్ లో…
ఘన్పూర్ నియోజక వర్గంలో 2 పంటలు దిగుబడి వస్తుందంటే కేసీఆర్ చలువే అని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందించేది కేవలం తెలంగాణలోనే. కాంగ్రెస్, బీజేపీ ల ఊక దంపుడు విమర్శలు మానుకోవాలి అని హెచ్చరించారు. ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా కూడా నేను ఇతరులు మాట్లాడినట్టు మాట్లాడకుండా నాకు పని చేయడమే తెలుసు… సంవత్సరంలో ఇక్కడి పనులు పూర్తి చేయిస్తాను అని తెలిపారు. గౌరవెళ్లి రిజర్వాయర్…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది.. ఫిర్యాదులు, లేఖలు నడుస్తూనే ఉన్నాయి.. తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్ కు మరోలేఖ రాసింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ… బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం మాత్రమే.. దాని నుండి కృష్ణా బేసిన్ ఆవలకు నీటి మల్లింపును ట్రిబ్యునల్ అనుమతించలేదని.. హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు నుండి బేసిన్ ఆవలకి నీటి తరలింపు వల్ల బేసిన్ లోని తెలంగాణ ప్రాజెక్టులు నష్టపోతాయని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. నది ఒడ్డున ఉన్న…
కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి.. కేవలం ఆన్లైన్ విద్యకే పరిమితం అయ్యారు.. అయితే, తిరిగి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన జరుగుతుందనే ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.. ఇక, విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం అన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాద్‌లోని మహబూబియా బాలికల పాఠశాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్, పాఠశాల విద్యా…