జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద నీరు కొనసాగుతుంది. హిమాయత్‌సాగర్‌లోకి ప్రస్తుతం 800 క్యూసెక్కుల వచ్చి చేరుతుంది. హిమాయత్‌సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.10 అడుగులకు నీరు చేరింది. దాంతో హిమాయత్ సాగర్ రెండు గేట్ల ద్వారా మూసీ లోకి 700 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఇక ఉస్మాన్ సాగర్ లోకి 1200 క్యూసెక్కుల నీరు వస్తుంది. ఉస్మాన్‌సాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1789.50 అడుగులుగా…
భద్రాచలం చర్ల మండల కేంద్రంలోని పాత చర్ల మామిడి తోటలో మందు పాతర పేలిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మావోయిస్టు వారోత్సవాలు విజయవంతం చేయాలంటూ చత్తీస్ఘడ్ సరిహద్దు లోని పలు ప్రాంతాలలో పోస్టర్లు వేశారు మావోయిస్టులు. సమీపంలోకి వచ్చిన ఒక యువకుడు ఆ పోస్టర్లు ని చూస్తున్నాడు. అయితే అక్కడ మావోయిస్టులు వదిలివెళ్లిన మ్యాగజైన్ పేలిపోయింది. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడగా., బైక్ ధ్వంసమైంది. స్థానికులు బాధితుడు్ని…
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజులు రాష్ట్రంలో ఆరెంజ్ అలెర్ట్, ఆ తరువాత 4 రోజులు ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ములుగు జిల్లా, వెంకటాపురంలో 12 సెంటి మీటర్ల వర్షపాతం నమోదవ్వగా, భద్రాద్రి కొత్తగూడెంలో 13, నల్గొండ జిల్లా చండూరులో 11.5, సిద్దిపేట జిల్లాలో 11.6, మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతంలో 11, సంగారెడ్డి జిల్లాలో 10.5 సెం.మీ, హైదరాబాద్‌లో 10, రంగారెడ్డిలో 8.8సెంటీ…
దేశంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 40 వేలకు పైగా నమోదవుతున్నాయి. డెల్టాతో పాటుగా డెల్టా ప్లస్ కేసులు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి మరో కొత్త వేరియంట్ పుట్టుకు వచ్చింది. అదే ఏవై 12 వేరియంట్. దేశంలో ఈ ఏవై 12 వేరియంట్లు ఆగస్టు 30 వ తేదీన దేశంలో మొదటిసారి గుర్తించారు. ఉత్తరాఖండ్‌లో మొదట వెలుగుచూసిన ఈ వేరియంట్ ఇప్పుడు…
తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దాటికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇక హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు సాయంత్రం కుండపోత వర్షం కురుస్తోంది. నిమిషాల వ్యవధిలో ఆకాశంలో మబ్బులు కమ్మేసి భారీ వానలు పడుతున్నాయి. భారీ వర్షం కారణంగా అంబర్పేట్- మూసారాంబాగ్ బ్రిడ్జి నీటమునిగింది. చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీరుచేరడంతో ప్రజలు తీవ్ర…
కొత్త బాస్ లు వచ్చాక కొత్త పనులు జరగటం సహజమే. తెలంగాణలో నలుగురు కొత్త పోలీస్ కమీషనర్ లు దూకుడు పెంచారట. అధికారుల బదిలీలతో పాటు, విధినిర్వహణపై ఒత్తిడి కూడా పెంచారట. ఇది డిపార్ట్మెంట్ లో కలకలానికి కారణమైందట.. పోలీస్ డ్యూటీ అంటే కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడు ఎక్కడ ఏ పోస్టింగ్ చేయాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. ఊహించని రీతిలో ప్రభుత్వం నాలుగు పోలీస్ కమిషనరేట్ లకు కొత్త గా అధికారులను నియమించింది. కొత్త…
తెలంగాణ జానపదానికి ఉన్న ఫాలోయింగే వేరు.. ఎప్పటికప్పుడు ఒక్కోపాట తెగ ట్రెండ్ అవుతుంది.. ఎక్కడికి వెళ్లినా అదే పాట ఇనిపిస్తుంటింది.. ఇప్పుడు తెలంగాణతో పాటు ఏపీలోనూ ట్రెండింగ్‌లో ఉన్న పాట బుల్లెట్ బండి… ఆ మధ్య ఓ వధువు.. పెళ్లి బరాత్‌లో ఈ పాటకు స్టెప్పులు వేయడంతో తెగ వైరల్ అయిపోయింది.. ఇక, ఆ తర్వాత ప్రతీ పెళ్లిలో బుల్లెట్ బండి పాట ఉండాల్సిందే అనే తరహాలో.. చాలా పెళ్లిళ్లలో ఈ పాటకు కాలు కదుపుతున్నారు. ఇప్పటికే…
సమాజ నిర్మాతలు మీరే-జాతి నిర్మాణం లో భాగస్వాములు కావాలని… భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేయాలని ఉపాధ్యాయులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు నిచ్చారు. విద్యార్థులకు నైతిక విలువలు,మానవీయ విలువలు నేర్పించాలని… ప్రయివేటు పాఠశాలల్లో లాగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా స్కూల్ డే లు నిర్వహిస్తామన్నారు. చిన్ననాడు పీర్ల కోటం లో చదువుకున్న, నాడు చదువు చెప్పిన ఉపాధ్యాయులు తనకెప్పటికి ఆదర్శమని వివరించారు. ఎంత ఎదిగిన గురువు ను మర్చిపోవొద్దని…గురుపూజ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు…
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సొంత పార్టీకి చెందిన మహిళా నేతే ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది… తననూ, తన కుమారులను చంపుతానని ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసిన టీఆర్ఎస్ మహిళా నేత పద్మా రెడ్డి… ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మంచిర్యాల ఏసీపీకి ఫిర్యాదు చేశారు.. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి బూతులు తిట్టాడని ఆరోపించిన ఆమె.. నా ఇద్దరు కుమారులను, నన్ను చంపేస్తానని ఎమ్మెల్యే చిన్నయ్య వార్నింగ్ ఇచ్చాడనీ..…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి గురు పూజోత్సవం. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అన్న, ఎంతటి స్థాయి కి ఎదిగిన గురువు గుర్తుకు వస్తారు. ఉపాధ్యాయ ఎంఎల్ సి అని గురువులు చట్టసభల్లో ఉండాలని పెట్టుకున్నాం. విద్య ఉద్యోగం కోసం కాదు, ఉన్నతమైన గౌరవం కోసం అని తెలిపారు.…