తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. హస్తినలో బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఈ నెల 1వ తేదీన ఢిల్లీ వెళ్లిన ఆయన.. మరుసటి రోజు టీఆర్ఎస్ కార్యాలయానికి శంకుస్థాపనలో పాల్గొన్నారు.. ఇక, మరుసటి రోజు.. ప్రధాని మోడీని, ఆ తర్వాత అమిత్‌షాను.. ఇవాళ కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్ర షెకావత్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. రేపు కూడా హస్తినలోనే ఉండనున్నారు సీఎం కేసీఆర్.. ఇప్పటికే ఆరు…
తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు తాగుతూ వస్తున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 301 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కగా.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతి చెందారు.. ఇక, ఇదే సమయంలో 339 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,59,844 కు చేరగా… రికవరీ కేసులు 6,50,453 కు…
కృష్ణా నది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతోన్న సమయంలో.. కేంద్ర మంద్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశం అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆరు రోజులుగా హస్తినలో మకాం వేసిన ప్రధాని మోడీ, అమిత్‌షా.. మరికొందరు కేంద్ర మంత్రులను కలుస్తున్న యాన.. ఇవాళ జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌తో భేటీ అయ్యారు.. కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని ఈ…
ఏఐసీసీ తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని, కమిటీలను ప్రకటించిన తర్వాత.. పార్టీలో కొత్త ఊపువచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. ఇక, టి.పీసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఐదుగురు సీనియర్ అధికార ప్రతినిధులను, 8 మంది అధికార ప్రతినిధులను ఒక సమన్వయ కర్తను నియమించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈ మేరకు టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే 10 మంది సీనియర్ ఉపాధ్యక్షులకు పార్లమెంట్ నియోజక…
కరోనా మహమ్మారి కారణంగా చాలా కాలం ఆన్లైన్ పాఠాలకే పరిమితయ్యారు విద్యార్థులు.. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు తిరిగి తెరుచుకున్నాయి.. ఇక, 2021-22 విద్యా సంవత్సరాన్ని అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు.. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 220 పని దినాలు ఉండగా.. ఈ సారి పరీక్షల విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. అర్ధ సంవత్సరం, ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆన్లైన్ తరగతులతో కలిపి విద్యా సంవత్సరంలో…
తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇక, హైదరాబాద్ మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.. ఓవైపు జంట జలశాయాలు నిండు కుండల్లా మరడంతో.. గేట్లను ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాలో ఇళ్లలోకి నీరు చేరి పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ఇక, వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం పడనుందని హెచ్చరించింది వాతావరణశాఖ.. సాయంత్రం 6 గంటల నుంచి 8…
హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి కొల్హాపూర్, సోమశిల, కరువేన గుండా ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యా వరకు (ఎన్.హెచ్ 167 కే. జాతీయ రహదారి నిర్మాణానికి నోటిఫికేషన్ జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్.. ఈ జాతీయ రహదారి వల్ల తెలంగాణలోని కల్వకుర్తి, కొల్హాపూర్, సోమశిల, ఆంధ్ర ప్రదేశ్ లోని ఆత్మకూరు లాంటి వెనుక…
హైదరాబాద్ లో ఈరోజు, రేపు, ఎల్లుండి మూడు రోజులు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది అని ఎన్టీవీతో వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న అన్నారు. రాష్ట్రంలో రుతుపవనాలు… దట్టంగా అలుముకున్న క్యూములో నింబస్ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయి. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అని తెలిపారు. కాబట్టి ఆ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా 16 జిల్లాలకు…
మంత్రి హరీష్‌రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్… జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని నమ్ముకొని ఈటల రాజేందర్ మోసపోయారని గమనించాలని సూచించారు.. ఇక, రబ్బరు చెప్పులు కూడా లేని హరీష్ రావుకు వందల కోట్ల ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మరోవైపు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో దొంగ నోట్లు పంచిన కేసు ఉండే అని కామెంట్ చేసిన…
విరసం నేత, ప్రముఖ కవి వరవరరావు బెయిల్‌ను మరోసారి పొడిగించింది బాంబే హైకోర్టు.. దాంతో పాటు షరతులు కూడా కొనసాగించింది… తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.. సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఇదే స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ నెల 24వ తేదీ వరకు బాంబేలోనే ఉండాలని స్పష్టం చేసింది. కాగా, ఎల్గార్ పరిషద్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో వున్న వరవరరావుకు…