VKB MAHILA DEATH: డెత్ మిస్టరీ..
- కుప్పగిరిలో మిస్టరీని తలపిస్తున్న మహిళ డెత్
- పక్కింట్లో దూలానికి వేలాడుతూ కనిపించిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VKB MAHILA DEATH: వికారాబాద్‌లో దారుణం జరిగింది. ఇంటి నుంచి రాత్రిపూట బయటకు వెళ్లిన మహిళ శవంగా మారింది. పక్కింట్లోనే ఉరికి వేలాడుతూ కనిపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మహిళను ఎవరైనా చంపేశారా? లేదా తానే ఆత్మహత్య చేసుకుందా? అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు కృష్ణవేణి. వికారాబాద్ మండలం కుప్పగిరిలో భర్త అశోక్‌తో కలిసి నివసిస్తోంది. ఉన్నట్టుండి ఈ మహిళ పక్కింట్లో శవమై తేలింది. ఐతే ఇది ముమ్మాటికీ హత్యే అంటున్నారు కృష్ణవేణి భర్త అశోక్.
మహిళ చనిపోయే కంటే నాలుగు రోజుల క్రితం కుప్పగిరికి చెందిన మదరప్ప, అశోక్ కుటుంబ సభ్యులకు భూమి విషయంలో పంచాయితీ జరిగింది. ఈ విషయంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అక్కడే పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నారు. ఇకముందు ఎలాంటి గొడవలు చేసుకోమని హామీపత్రం సైతం రాసుకున్నారు. అలా పెద్దల మధ్య ఒప్పందం రాసుకున్న వారు.. భూమి విషయంలో మరోసారి గొడవకు దిగారు. ఇందులో అశోక్ భార్య కృష్ణవేణిపై మదరప్ప కుటుంబ సభ్యులు దాడి చేసి గాయపర్చారు. ఐతే అదే రోజు రాత్రి గ్రామంలో ప్రదర్శించిన నాటకం చూడటానికి వెళ్తానని చెప్పిన కృష్ణవేణి.. తెల్లవారే సరికి పక్కింట్లో దూలానికి ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో తన భార్యను మదరప్ప కుటుంబ సభ్యులు హత్యచేసి.. ఇలా ఉరి వేశారని మృతురాలి భర్త, కుటుంబీకులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
పరిసరాలను పరిశీలించి.. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని బాధిత కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. మృతురాలి భర్త అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!