కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ… బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై ఘాటు వాఖ్యలు చేసారు. బండి సంజయ్ ది విహారాయత్రనో ఏం యాత్రనో తెలువది అని చూపిన ఆయన దానికి అభివృద్ధి యాత్ర అని పెట్టుకుంటే బాగుంటుంది అని సూచించారు. యాత్ర పేరుతో తిరుగుతున్న బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మానకొండూర్ కు ఎన్ని నిధులు ఇచ్చాడో నియోజకవర్గ ప్రజలకు స్పష్టం చేయాలి అన్నారు. ఇక నేను ఎమ్మెల్యే గా 20 కోట్ల నిధులు ఇచ్చినా అని చెప్పిన ఆయన ఎంపీ బండి సంజయ్ 20 రూపాయలు ఇచ్చినాడా అని ప్రశ్నించారు. బండి సంజయ్ కు బెజ్జంకి మండలంలో అడుగుపెట్టే అర్హత ఉందా అని అడిగారు. ఇక కాంగ్రెస్ నాయకులు ఈమధ్య చెప్పుకోలేని విధంగా అసభ్యకరంగా మాటలు మాట్లాడుతున్నారు… తిడుతున్నారు అని పేర్కొన రసమయి ఇకపై మాటలు మర్యాదగా మాట్లాడకపోతే నాలుకలు తెగ కోస్తా అని హెచ్చరించారు.