కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది.. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు.. దీంతో ఎవరికి తోచినట్టు వారు చేసేస్తుంటారు.. అయితే, కాంగ్రెస్ పార్టీలో తాజా పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… పార్టీలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని.. రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి ముగ్గురు ముఖ్యమేనని మీడియా చిట్‌చాట్‌లో అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి, పీసీసీ కొత్త కమిటీకి గ్యాప్ ఉందని.. కాకపోతే అందరం కలిసి పని చేయాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. ఇక,…
దాదాపు రెండేళ్లుగా ప్రపంచం కరోనా గుప్పిట్లోనే మగ్గుతోంది. కోవిడ్-19కి విరుగుడుగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజల్లో మాత్రం ఆ మహమ్మరి సృష్టించిన భయం మాత్రం పోవడం లేదు. ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా ప్రభావం ఎక్కువగానే కన్పిస్తోంది.. కరోనా ఫస్ట్ వేవ్ లో ఎంతో అప్రమత్తంగా ఉన్న ప్రభుత్వం సెకండ్ వేవ్ లో పాలకుల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకుంది. అక్టోబర్ నెలలో థర్డ్ వేవ్ వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవడంపై భిన్నాభిప్రాయాలు…
ఈ రచ్చ ఇప్పటిది కాదు… రెండు నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. వివాదం కొలిక్కి వస్తుందనుకుంటే… మళ్లీ మొదటికొచ్చింది. టీ కాంగ్రెస్ లో జరుగుతున్న లేటెస్ట్ రచ్చకు కారణమేంటి? తెలంగాణ కాంగ్రెస్ లో… ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి… పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిల మద్య ఒకప్పుడు మంచి మైత్రి ఉండేది. కానీ… రేవంత్ చీఫ్ అయ్యాక సీన్ మారింది. కోమటిరెడ్డి…రేవంత్ మద్య గ్యాప్ పెరిగింది. పిసిసి నియామక సమయంలో టీడీపీ నుండి…
రాబోయే రోజుల్లో ఏనుగునెక్కి అసెంబ్లీకి వెళ్తాం.. ఇదే ఊపును కొనసాగిస్తూ ప్రగతిభవన్‌ను కూడా హస్తగతం చేసుకుంటాం అని వ్యాఖ్యానించారు బీఎస్పీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఉమ్మడి పాలమూరు జిల్లా బీఎస్పీ సమీక్షా సమావేశానికి వెళ్తూ జడ్చర్లలో ఆగిన ఆయన.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వివిధ పార్టీల్లో దగాపడ్డ వేలాది ప్రజలు ఆ జండాలను చెత్తకుండిల్లో పడేసి కాన్షిరాం చూపిన బాటలో నడవడానికి…
టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల్ని చీట్ చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.. మహిళా సాధికారతకి కాంగ్రెస్ పెద్ద పీటవేసిందని.. కానీ, టీఆర్ఎస్ మహిళల్ని చీట్ చేస్తోంది.. ఒక్కో మహిళకు ఐదు నుండి 10 వేలు బాకీ ఉన్నారన్నారు. కాంగ్రెస్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని గుర్తుచేసిన ఉత్తమ్.. కానీ, కేసీఆర్ సీఎం అయ్యాక… వడ్డీ…
తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ కోమటిరెడ్డి వెంకటె రెడ్డి కలకలం తీవ్రమవుతోంది. పీసీసీ ఆదేశాలను పట్టించుకోకుండా ఆయన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లడం.. ఆ తర్వాత పీసీసీపైనే.. నిద్రపోతోందా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించడం చూస్తుంటే.. ఆయన తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధమైనట్టు కనిపిస్తున్నారు. కాకుంటే.. తనకు తానుగా కాకుండా.. పార్టీనే స్వయంగా వెళ్లగొట్టేలా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే.. కోమటిరెడ్డి మొదటి నుంచీ ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పుడు.. ఆ…
ఒక్క భేటీ వంద అనుమానాలకు కారణమైంది. పార్టీ కార్యాలయ శంకుస్ధాపనకు ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్…ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని కలిశారు. ఇదే ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని కాంగ్రెస్… అలాంటిదేం లేదు… కాళ్ల బేరానికి వచ్చారని బిజెపి విమర్శిస్తున్నాయి. కేసీఆర్ ఢిల్లీ టూర్ చుట్టూ పెద్ద చర్చే నడుస్తోంది. మూడు రోజుల డిల్లీ పర్యటనకు బుధవారం బయలుదేరి వెళ్లారు సియం కేసిఆర్. సెప్టెంబర్ 2 న వసంత్ విహర్ లో పార్టీ…
వైఎస్ షర్మిల.. గతంలో జగనన్న బాణం. ఇప్పుడు మాత్రం.. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటాన్ని ముందుకు తీసుకుపోతూ.. అధికారం లక్ష్యంగా సాగుతున్న పయనం. ఆమె అడుగులు ఎక్కడివరకూ పడతాయి.. లక్ష్యాన్ని చేరుకుంటారా.. లేక.. చతికిలబడతారా.. అన్నది పక్కన బెడితే.. ఇటీవల ఆమె చేసిన ట్వీట్ మాత్రం.. వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాను ఒంటరినైపోయానంటూ.. ఆమె వైఎస్ ను తలుచుకోవడం.. చర్చనీయాంశమైంది. ఇక్కడే… ఓ విషయాన్ని చాలామంది ప్రస్తావిస్తున్నారు. జగన్ సైతం వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత.. ఒంటరిగా నిలిచారని..…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. హస్తినలో మకాం వేశారు.. మొదట మూడు రోజుల పర్యటన అంటూ ఢిల్లీ బయల్దేరిన సీఎం.. ఇప్పుడు హస్తిన పర్యటనను పొడిగించారు.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన ఆయన.. ఇవాళ కూడా ఢిల్లీలోనే బస చేయనున్నారు.. రేపు మరికొన్ని భేటీలు జరగనున్నట్టు తెలుస్తోంది.. సోమవారం రోజు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసే అవకాశం ఉండగా.. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌ను…
పాపం తెలంగాణ కాంగ్రెస్ నేతలు. వాళ్లు ఒకటి తలిస్తే.. అధిష్టానం ఇంకోటి తలిచినట్టుంది. ఈ గ్రూపుల కొట్లాటలో.. తలదూర్చడం ఎందుకనుకున్నారో ఏమో కానీ.. ఇప్పట్లో తెలంగాణలో రాహుల్ గాంధీ సభ ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి.. ఈ నెల 8నే గజ్వేల్ లేదా.. నర్సాపూర్ నియోజకవర్గంలో దళిత గిరిజన దండోరా సభను నిర్వహించాలని ఆ పార్టీ భావించింది. ఆ తర్వాత 17న తెలంగాణ ఉద్యమ కేంద్రం వరంగల్ లో ముగింపు సభను…