రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. జిల్లాలోని అనేక ప్రాంతాలతో పాటు.. సిరిసిల్లా టౌన్ లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.. పార్క్ చేసిన కార్లు.. పడవలుగా మారిపోయాయి కొట్టుకుపోయాయి.. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో అయితే.. ముంపులో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నవారు మరికొందరు.. అయితే, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సిరిసిల్లాకు బయల్దేరాయి జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు.. హైదరాబాద్‌లో వరదల సమయంలో.. డీఆర్ఎఫ్ బృందాలు చాలా కీలక పాత్ర పోషించాయి..…
బీజేపీ రాష్ట్ర కమిటీకి పవర్ లేదు… పవర్ అంతా.. ఢిల్లీ చేతిలోనే అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎదుగుదలను అడ్డుకోవడానికి తెరాస.. బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. గల్లీలో బండి సంజయ్ సీఎం నీ గల్లీలో బండ బూతులు తిడతారు. శిశుపాలుడు వంద తప్పులు చేసినట్టు.. బండి సంజయ్ ఇప్పటికీ సీఎంని జైల్లో పెడతా అని రెండు వందల అబద్ధాలు అడి ఉంటారు అని తెలిపారు. పులి.. మేక ఆటలో బండి సంజయ్ బలి అయిపోతారు.…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నిర్మల్‌కు వచ్చేయనున్నారు.. తెలంగాణ విమోచన సభను నిర్మల్ లో నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. అయితే, 17వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడనుంది.. ఇప్పటికే సంజయ్ పాదయాత్ర 100 కిలోమీటర్ల మైలు రాయిని దాటేసింది.. అయితే, 17వ తేదీన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర…
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ వర్ష ప్రాభావిత 20 జిల్లాల కలెక్టర్లతో నేడు సమీక్ష నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ… ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలి. జిల్లాల్లోని అధికారులందరూ కార్యస్థావరంలోనే ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైతే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దాదాపుగా అన్ని చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిగా నిండాయి. ఈ నేపథ్యంలో అన్ని…
ఆ మాజీ మంత్రి కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారా? విపక్షాలు వేగం పెంచడంతో టంగ్ స్లిప్ అవుతున్నారా? వివాదాస్పద కామెంట్స్ ప్రచారం కోసమా లేక ఫస్ట్రేషన్‌తో చేస్తున్నారా? ఎవరా మాజీ మంత్రి? హామీ ఇస్తే విపక్షాలకు 6 నెలలు అధికారం అప్పగిస్తారట! జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. మాజీ మంత్రి కూడా. ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. ఆయనకు ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నారు? అనే ప్రశ్నలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలను నిలిపివేసి..…
ఒకే దెబ్బకు చాలా పిట్టలు.. కేసీఆర్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఏకంగా 50వేల ఉద్యోగాల ప్రకటన.. జాబ్ క్యాలెండర్ ను దసరాకు రిలీజ్ చేసి అటు వైఎస్ షర్మిలకు ఎజెండా లేకుండా చేయడం.. ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నోరు మూయించడమే ధ్యేయంగా ముందుకెళుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే తెలంగాణ నిరుద్యోగుల ఆశలు నెరవేరడంతోపాటు వైఎస్ఆర్ టీపీ, కాంగ్రెస్ లను దెబ్బతీయవచ్చని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట.. హుజూరాబాద్ ఉప ఎన్నికల సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రత్యర్థి…
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితి పై ఢిల్లీ నుంచి సీఎం కేసిఆర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పూర్తి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సిఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. భారీ వానల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలు మండలాల్లోని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా శాఖల…
గత మూడు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటం వ్యవసాయానికి మంచిదే. అయితే, పట్టణ, నగర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పట్టణ, నగరాల్లోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సిరిసిల్ల పట్టణంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో సిరిసిల్లలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లొతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వినాయక చవితి పండుగ కోసం ఏర్పాటు చేసిన వినాయకుని…
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్… నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమైన ఆయన… కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. KRMB, GRMBల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు సమయం కావాలని… అప్పటి వరకు రెండు బోర్డులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆరు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్… వరుసగా కేంద్రమంత్రుల్ని కలుస్తున్నారు. నిన్న…
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి మళ్ళీ వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,31,833 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 57,514 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 874.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 161. 2918 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్…