తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యే, వర్కింగ్‌ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.. అయితే, ఈ ఎపిసోడ్ ఇవాళ్టితో ముగిసిపోయిందని.. మళ్లీ రిపీట్ కాదని ప్రకటించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇవాళ ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజుతో సమావేశమైన వివరణ ఇచ్చారు జగ్గారెడ్డి.. నిన్నటి వ్యవహారంపై కార్యదర్శులు ఆయనతో మాట్లాడారు.. తను వ్యాఖ్యలు చేయడానికి కారణాలను పార్టీ నేతలకు ఏకరువు పెట్టారు.. ఇక, అనంతరం మీడియాతో మాట్లాడిన తూర్పు జయప్రకాష్‌రెడ్డి.. ఈ ఎపిసోడ్ ముగిసిందని ప్రకటించారు.. మేం మేం అన్నదమ్ములలాంటి వాళ్లం.. అన్నదమ్ములు అన్నప్పుడు సమస్యలు ఉంటాయని.. కలిసి మాట్లాడుకుంటాం.. కలిసే పనిచేస్తాం అని స్పష్టం చేశారు.
నేను కొన్ని విషయాలు మాట్లాడా.. నా తప్పు జరిగింది.. అటు సైడ్ కూడా తప్పు జరిగిందన్నారు జగ్గారెడ్డి.. కానీ, మళ్లీ రిపీట్ కాదని స్పష్టం చేశారు.. అందరం కలిసి మెలిసి పని చేస్తాం అన్నారు.. దీనిపై క్యాడర్ అపోహలకు పోవద్దని సూచించారు.. ఇక, అంతర్గత విషయాలు మీడియా ముందు మాట్లాడను అని పార్టీ నేతలను చెప్పా.. మా కొట్లాట మొత్తం టీఆర్ఎస్, బీజేపీ మీదేనని ప్రకటించారు జగ్గారెడ్డి.. ఇంతకు ముందు కలిసి నడిచాం.. ఇవాళ్టి నుంచి అల్లుకుని మాట్లాడతామన్న ఆయన.. పార్టీ నన్ను మీడియాకు పోవడం తప్పు అని అనింది.. దానికి సారీ చెప్పినట్టు వెల్లడించారు.