కామారెడ్డి జిల్లాలో ఆర్మీ జవాన్ అదృశ్యం కలకలం సృష్టిస్తోంది.. కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కెంగర్ల నవీన్ కుమార్ (28)… గత ఆరు రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు.. ఆగస్టు 4వ తేదీన జోధ్‌పూర్ నుంచి సెలవు పైన స్వగ్రామం వచ్చిన జవాన్ నవీన్ కుమార్.. గత నెల 29వ తేదీన అర్ధరాత్రి కామారెడ్డి నుంచి హైదరాబాద్ బయల్దేరాడు.. అయితే, ఆగస్టు 30వ తేదీ నుంచి నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో…
గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్ష బీభత్సవానికి హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది… ఈ నేపథ్యంలో.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.. రాగల 4 రోజులపాటు భారీ నుంచి అతి భారీవర్షాలు పడతాయని పేర్కొంది.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మహబూబాబాద్, యాదాద్రి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, భువనగిరి, వరంగల్, ములుగు, జనగామ జిల్లాల్లో భారీ…
అది పేరుకేమో మహానగరం.. తెలంగాణ కీర్తి కీరిటానికి బ్రాండ్ అంబాసిడర్.. అన్ని మతాలు, కులాలకు కేరాఫ్.. మినీ భారతదేశంగా పేరుగాంచిన హైదరాబాద్ ఒక్క చిన్నవానకే అతలాకుతలం అవడం ఏమిటీ? అన్న ప్రశ్న ప్రతీఒక్కరి మనస్సులో మొదలుతోంది. వేల కోట్ల రూపాయాలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని డబ్బాలు కొట్టుకునే పాలకులు ప్రస్తుత దుస్థితికి ఎవరు బాధ్యత తీసుకుంటారనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. గత పాలకుల తప్పిదమని ఒకరంటే ఇప్పుడున్న పాలకులదే తప్పని మరొకరు.. ఇలా విమర్శలు చేసుకుంటూ తప్పించుకుంటున్నారు.…
హుజూరాబాద్ ఉప ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నా కొద్దీ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నేతలంతా వీరలెవల్లో ఫార్మామెన్స్ చేసేస్తున్నారు. ఎవరికీ వారు తగ్గెదేలే అన్నట్లుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండటంతో నేతల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాలు సైతం బహిర్గతం అవుతున్నాయి. తాజాగా టీఆర్ఎస్ లో చేరిన నేత కౌశిక్ రెడ్డి.. బీజేపీ నేత ఈటల రాజేందర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేయడం…
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే… ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 306 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… ముగ్గురు మృతి చెందారు.. ఇదే సమయంలో 366 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,59,313 కు…
ఇవాళ తెలంగాణ విద్యాశాఖ పాఠశాల అకాడమిక్ క్యాలెండర్ ను రిలీజ్ చేసింది. అకాడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా విడుదల చేశారు. ఏడాది కాలంలో 213 రోజులు పాఠశాల పనిదినాలుగా ఉంటాయన్నారు. 47 రోజులు ఆన్టైన్ ద్వారా 116 రోజులు ప్రత్యేక తరగతుల ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాల చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 23 అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 25 లోపు…
ఢిల్లీ : కేంద్ర హోమంత్రి అమిత్ షాతో తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. కేంద్ర హో మంత్రి అమిత్ షా నివాసంలో ఈ సమావేశం జరిగింది. విభజన చట్టం హామీల అమలు, ఐపీఎస్ అధికారుల సంఖ్య ని 195 కు పెంచాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కోరనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేంద్ర నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేయనున్నారు సీఎం కేసీఆర్. ఐపీఎస్ కేడర్ పోస్టుల కేటాయింపులు…
హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా ఆయనను యాదాద్రికి ఆహ్వానించారు కేసీఆర్.. ఇతర అంశాలను కూడా పీఎం దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. అందుకే మోడీని కలిశారనే కామెంట్లు కూడా వినబడ్డాయి.. అయితే, ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్… సీఎం కేసీఆర్ భయపడి ప్రధాని మోడీని కలవలేదని.. భయపడే నైజం కేసీఆర్ ది కాదన్న ఆయన..…
దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.. అందులో భాగంగా.. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది.. అయితే, కరోనా నేపథ్యంలో.. 11 రాష్ట్రాలు ఇప్పుడే ఎన్నికలు వద్దని ఎన్నికల సంఘాన్ని కోరాయి.. దీంతో.. ఆ 11 రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం… పశ్చిమ బెంగాల్లో 3 స్థానాలకు, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానానికి బైపోల్ నిర్వహించనున్నారు.. పశ్చిమ…
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ దగ్గర జరిగిన దిశ ఎన్కౌంటర్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది… అయితే, దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టింది కమిషన్.. ఎన్‌కౌంటర్‌పై పూర్తిస్థాయిలో విచారణ జరగనుంది.. అందులో భాగంగా ఎన్కౌంటర్లో చనిపోయినవారి కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించనున్నారు అధికారులు.. ఇక, ఈ నేపథ్యంలో ఎన్టీవీతో మాట్లాడిన ఎన్కౌంటర్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు.. తమకు బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. కమిషన్ విచారణ కోసం రోజు వస్తున్నాం.. లోపల ఏది…