జమ్మికుంట మండలం మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు స్థానిక నేతలు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ఇక్కడ ధర్మానికి, న్యాయానికి స్థానం ఉంటుంది. మేం ప్రశాంతంగా ఉంటాం మా జోలికి వస్తె ఊరుకోం. దౌర్జన్యం జరిగితే ముందుగా చిందవలసింది నా రక్తపు బొట్టే. కేసులు పెడితే, జైళ్లో పెడితే ముందు నన్ను పెట్టు అన్నారు. అలాగే నేను ప్రజలకు ఏమీ చెయ్యక పోతే 6 సార్లు ఎలా గెలిపించారు నన్ను అని అడిగారు. నన్ను ఏం చేతకాని వాడిని అంటావా? నా జోలికి రాకండి. సముద్రం నిచ్చలం గా ఉంటుంది.. తుఫాను వస్తె తెలుస్తుంది దాని ఉదృతం… ప్రళయం సృష్టిస్తము ఖభర్డార్ అని తెలిపారు.
నా కొట్లాట నీలాంటి బానిసల మీద కాదు. నా కొట్లాట కేసీఆర్ మీద. కేసీఆర్ డబ్బు సంచులకి నా ధర్మానికి మధ్య ఎన్నిక … తలకాయలు మెదడు ఉంటే.. మనిషి వైతే అడుగుతున్న. రెండు గుంటలు వాడు 250 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నడు… ఇదంతా నీ అక్రమ సొమ్ము కాదా అని ప్రశ్నించారు. డప్పులు కొట్టడానికి రాకుండా అడ్డుకున్నారట. దళిత బంధు డబ్బు మా ప్రజల కష్టపడ్డ డబ్బు. ఈ తెలంగాణ డబ్బుకి ఓనర్ కాదు కాపలాడారుడివి మాత్రమే. ఇది నీ అబ్బ జాగీరు కాదు. నీకు తెలుసు నువ్వు గెలవవు అని. అయినా దింపుడు కళ్ళెం ఆశ పడుతున్నారు. డబ్బులు, మద్యం, నాయకులను పక్కన పెట్టు… నువ్వు పోటీ చెయ్యి అని డిమాండ్ చేసిన. నా చరిత్ర ఉప్పల్, జమ్మికుంట రైల్వే స్టేషన్, కరీంనగర్, మహబూబ్ నగర్ జైల్స్ ను అడుగు, మానుకోట రక్తపు చుక్కను అడుగు నా చరిత్ర చేపుతుంది అన్నారు.
నన్ను వెళ్లగొట్టారు. దమ్ముంటే పోటీ చెయ్యి అన్నారు. వినోద్ కుమార్ కి ఎక్కడ ఓట్లు రాకపోయినా హుజూరాబాద్ లో 57 వేల మెజారిటీ ఇచ్చిన. ఆయన కూడా నన్ను రాజీనామా చేయమన్నారు. చేసి మీ ముందుకు వచ్చిన నన్ను కాపాడుకోండి అని ప్రజలకు సూచించారు ఈటల. నేను గెలిస్తే తెలంగాణ గెలిచినట్లు అని పేర్కొన్నారు.