SKLM MARPHING: మార్ఫింగ్ మాయ..
- రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న ఏఐ సాంకేతికత
- కొంత మంది ఆకతాయిలు మిస్ యూజ్ చేస్తున్నారు
- అశ్లీలాలకు, జుగుప్స కలిగించే వీడియోలకు వాడుతున్నారు
- విద్యార్థినుల ఫోటోలను ఏఐ టూల్స్ సాయంతో మార్ఫింగ్
- ఓ విద్యార్థినికి ఆ ఫోటోలు చూపించి బెదిరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SKLM MARPHING: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అక్రమాలకు కొంత మంది ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళంలో ఏఐ టూల్స్ ఉపయోగించి విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేశారు కొంత మంది విద్యార్థులు. దీంతో గురజాడ గాయత్రి కళాశాలలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ కాలేజీలో ఏం జరిగింది? విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు? నిందితులను పోలీసులు పట్టుకున్నారా? కాలేజీ యాజమాన్యం వెర్షన్ ఏంటి?. AI సాంకేతిక పరిజ్ఞానం.. రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లుగా ఫోటోలు.. వీడియోలు క్రియేట్ చేయడంలో సాంకేతిక పరిజ్ఞానం బాగా ఉపయోగపడుతోంది. కానీ దానిని కొంత మంది ఆకతాయిలు మిస్ యూజ్ చేస్తున్నారు. అశ్లీలాలకు, జుగుప్స కలిగించే వీడియోలకు వాటిని వాడుతున్నారు. శ్రీకాకుళంలోని మునసబుపేటలో ఉన్న గురజాడ గాయిత్రి కళాశాలలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ కాలేజీలో చాలా మంది విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసిన అంశం కలకలం సృష్టించింది.
ఈ మధ్య కాలేజీలో ఓ కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా చాలా మంది విద్యార్థినీ విద్యార్థులు ఫోటోలు దిగారు. ఇది సర్వసాధారణంగా ఎక్కడైనా జరిగేదే. కానీ ఇక్కడే కొంత మంది విద్యార్థులు.. తమ కన్నింగ్ బ్రెయిన్ వాడారు. పలువురు విద్యార్థినుల ఫోటోలను ఏఐ టూల్స్ సాయంతో మార్ఫింగ్ చేశారు. అంతే కాదు ఓ విద్యార్థినికి ఆ ఫోటోలు చూపించి బెదిరించారు. డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేశారు. దీంతో ఒక్కసారిగా షాకయిన విద్యార్థిని.. ధైర్యంగా విషయాన్ని తల్లిదండ్రులతో పంచుకుంది. తల్లిదండ్రులు ప్రశ్నించడంతో విషయం బయటకు వచ్చింది. కానీ కాలేజీ యాజమాన్యం మాత్రం పరువు కోసం ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించింది. గుట్టుచప్పుడు కాకుండా ఆయా విద్యార్థులుకు టీసీ ఇచ్చి చేతులు దులిపేసుకుంది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
అంతకు ముందు కాలేజీ యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టి.. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ మొదటి ఏడాది చదవుతున్న సాయి, మధు, బాలు, హర్షవర్థన్‌తో పాటు బీఎస్సీ సీనియర్ విద్యార్థినిని కూడా బాధ్యులుగా గుర్తించారు. వీరి నుంచి 5 జీబీ డేటాను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. వీరిలో నలుగురు జూనియర్లకు రెండు రోజుల క్రితం టీసీలు ఇచ్చి కాలేజీ నుంచి పంపించేశారు. విద్యార్ధినులందరూ కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చి నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చివరకు విద్యార్థినుల ఫొటోల మార్ఫింగ్‌లో సంబంధం ఉన్న విద్యార్థులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని యాజమాన్యం.. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వివిధ కోణాల్లో ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!