కాంగ్రెస్ లో పెరుగుతున్న అసమ్మతి.. నేతలతో అధిష్టానం కీలక భేటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం అధిష్టానం ఎంత సమయం తీసుకుందో అందరికీ తెల్సిందే. పార్టీలోని అందరూ సీనియర్ల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. అయితే తొలి నుంచి రేవంత్ రెడ్డికి పార్టీలోని సీనియర్ల నుంచి సవాళ్లు ఎదురవుతూనే వస్తున్నాయి. వీటన్నింటిని రేవంత్ ఒక్కొక్కటిగా దాటుకుంటూ ముందుకు పోతున్నారు. అయితే రోజురోజుకు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లంతా గళం విప్పుతుండటంతో పార్టీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. దీంతో ఎప్పుడు, ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఆపార్టీ శ్రేణుల్లో నెలకొంది.
దూకుడు రాజకీయాలకు రేవంత్ రెడ్డి కేరాఫ్ గా నిలుస్తున్నారు. టీపీసీసీగా నియామకం అయ్యాక వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా బాగున్నప్పటికీ ఆయన పార్టీలోని సీనియర్లను కలుపుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నారు. పార్టీలో చర్చించకుండా రేవంత్ ఏకపక్షంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో చేసే కార్యక్రమాలకు సైతం సమాచారం ఇవ్వడం లేదంటూ రేవంత్ పై సీనియర్లు మూకుమ్మడి దాడి చేస్తున్నారు.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
రేవంత్ రెడ్డి టీపీసీసీగా నియామకం అయ్యాక పార్టీలోని సీనియర్ల అందరితో వరుసగా భేటి అయ్యారు. అందరినీ కలుపుకుపోతానని ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఆయన తన వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నాడని సీనియర్లు ఆరోపిస్తున్నారు. దళిత, గిరిజన దండోరా కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమంటూ రేవంత్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంద్రవెల్లి సభకు సీతక్క అధ్యక్షత వహించడం.. రావిర్యాల సభను రేవంత్ టీం ముందుండి నడిపించడం.. మూడుచింతలపల్లి దీక్షలో సీనియర్లు తెరపై కన్పించే పరిస్థితి లేకపోవడం.. గజ్వేల్ సభలో రేవంత్ మాత్రమే ఫోకస్ అవడాన్ని ఆయన వ్యతిరేకవర్గం తట్టుకోలేకపోతుంది.
ఈ సభల సాక్షిగానే రేవంత్ సొంత నిర్ణయాలను ప్రకటించడాన్ని సీనియర్లు తప్పుబడుతున్నారు. అధికారిక ప్రతినిధుల పేర్లు సైతం పార్టీలో చర్చించకుండానే ప్రకటించడం రేవంత్ ఒంటెద్దు పోకడలకు నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఎవరెవరు వస్తున్నారనే సమాచారం పార్టీలోని ముఖ్య నేతలకు ఇవ్వకపోవడం ఏంటనే ప్రశ్నిస్తున్నారు. రేవంత్ గతంలో చెప్పిన దానికి ప్రస్తుతం చేస్తున్న దానికి ఎలాంటి పొంతన లేదని మండిపడుతున్నారు. దీంతో పార్టీలో పరిస్థితి రేవంత్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా మారిపోయింది.
మరోవైపు రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లు.. సీనియర్లు అంటూ పార్టీని ఏడేళ్లుగా ముంచుతున్నారనే భావన అధిష్టానంలో ఉంది. దీంతో సీనియర్లను కట్టడి చేసే ప్రయత్నం అధిష్టానం చేస్తోంది. రేవంత్ తో కలిసి నడవాల్సిందేనంటూ సూచిస్తుంది. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ రేవంత్ కు అండగా నిలుస్తున్నారు. కాగా రేవంత్ కు వ్యతిరేకంగా పార్టీలోని సీనియర్లంతా ఏకమవుతుండటం ఆసక్తిని రేపుతోంది. ఇలాంటి సమయంలోనే నేడు కీలకమైన పీఏసీ సమావేశం జరునుంది. ఈ భేటికి ఎవరెవరు వస్తారు? ఏమేమీ చర్చకు వస్తాయనేది ఉత్కంఠతను రేపుతోంది. దీంతో ఈ సమావేశంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది మాత్రం వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!