తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి పెరిగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువ సవరణను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ 50 శాతం, ఖాళీ స్థలాలు 35 శాతం, అపార్ట్మెంట్ ఫ్లాట్ విలువ 25-30 శాతం పెంచుతూ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత మార్కెట్ విలువకు సవరించిన విలువకు మధ్య సరాసరి వ్యత్యాసం 35-40 శాతం ఉండనున్నట్లు సమాచారం. Read Also: నిరుపేదలకు శుభవార్త.. ప్రారంభానికి సిద్ధమవుతున్న సర్కారు ఇళ్లు మరోవైపు…
ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం హౌసింగ్ ప్రాజెక్టు హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో పూర్తయింది. ఈ ప్రాజెక్టు వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా రూ.1,422.15 కోట్లతో ప్రభుత్వం 15,600 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించింది. ఇందులో 115 బ్లాకులు, 234 లిఫ్టులు ఉన్నాయి. అలాగే ప్లే స్కూల్స్, అంగన్వాడీ సెంటర్లు, ప్రైమరీ, హైస్కూళ్లు, బస్ టెర్మినల్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంకులు, బస్తీ దవాఖానాలు, ఏటీఎంలు, బ్యాంకులు, సైక్లింగ్ ట్రాక్స్…
✪ తిరుమల: నేడు ఫిబ్రవరి నెల శ్రీవారి ప్రత్యేక దర్శనం టోకెన్లు విడుదల… ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు విడుదల… రోజుకు 12వేల టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.. రేపు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ✪ విశాఖ: నేడు ఎన్టీఆర్ భవన్లో అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం… ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు.. సమ్మెను విజయవంతం చేసే కార్యాచరణపై చర్చించనున్న కార్మిక…
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా అడ్డుకున్నది కేసీఆరేనని ఆరోపించారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే కేసీఆర్ లోపాలు బయటపడతాయని, కమీషన్ల కక్కుర్తి అంతా ప్రజలకు తెలిసిపోతుందని భయమని విమర్శించారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణను కేంద్రం చేతుల్లోకి వెళ్లనివ్వడంలేదని జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు. Read Also: తెలంగాణకు శుభవార్త.. నాబార్డ్ నుంచి 1.66 లక్షల రుణం…
తెలంగాణకు నాబార్డు గుడ్‌న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి లక్షా 66 వేల 384 కోట్ల రుణ సామర్థ్యంతో నాబార్డు రూపొందించిన రాష్ట్ర దృష్టి పత్రాన్ని మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి విడుదల చేశారు. వ్యవసాయ రంగానికి రుణ పరపతి పెంచాలని.. జనాభాలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారని చెప్పారు. Read Also: కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలి: వీహెచ్ నాబార్డ్ సహకారంతో మిషన్ కాకతీయ పథకం కింద…
ఇటీవల ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీగా గెలిచిన తాతామధు గురువారం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న గ్యాప్‌లను భర్తీ చేస్తానన్నారు. అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పారు. పార్టీలో నిర్మాణ పరమైన సమస్యలను పరిష్కారం చేసే దిశగా తన వంతు సాకారం అందిస్తానని వెల్లడించారు. తెలంగాణ సిద్ధాంతం ను, తెలంగాణ ఏర్పడడానికి గల కారణాలను ప్రజల వద్దకు తీసుకుని ముందుకు వెళ్తాం అన్నారు. పార్టీని ఒక్క…
జాతీయ పట్టణ ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో పట్టణీకీకరణ భారీ ఎత్తున పెరుగుతుందని, ఫలితంగా పట్టణ పేదరికం కూడా పెరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు. పట్టణాలకు వచ్చే పేద ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం వారి ఆదాయ మార్గాలు పెంచాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు. పట్టణ పేద ప్రజలు కనీస అవసరాలను అందుకునేలా వారి ఉపాధి హామీ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని…
దాడులు చేసే సంస్కృతికి బీజేపీ వ్యతిరేకమని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. దాడులకు బీజేపీ కార్యకర్తలు భయపడరన్నారు. రుణ మాఫీ ,డబల్ బెడ్ రూమ్ ,పెన్షన్ లాంటి పనులు సరిగా ఇవ్వని టీఆర్ఎస్ నాయకులపై ఇలానే దాడులు చేయమంటారా అంటూ ఫైర్ అయ్యారు. సిద్ధాంతం కోసం త్యాగాలు చేయడానికైనా కాషాయ కార్యకర్తలు వెనుకడారన్నారు.…
కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ఒమిక్రాన్ వేరియంట్ రూపంతో మరిసారి దాడి చేస్తూ.. థర్డ్ వేవ్‌కు కారణం అయ్యింది.. అయితే, థర్డ్ వేవ్ కల్లోలం లోనూ ఇప్పటికే ఎంతో మంది కేంద్ర మంత్రులు, రాష్ట్రాల సీఎంలు, రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఉన్నతాధికారులు.. ఇలా ఎంతో మందిని కోవిడ్ పలకరించింది. ఇక, సినీ ప్రముఖుల్లోనూ సూపర్‌స్టార్, మెగాస్టార్.. ఇలా చాలా మంది హీరోలు సైతం కోవిడ్ బారినపడ్డారు.. తాజాగా, తెలంగాణకు చెందిన మరో మంత్రికి…
✪ ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా నేటి నుంచి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ సంఘాల రిలే నిరాహార దీక్షలు… ఈనెల 30 వరకు కొనసాగనున్న ఉద్యోగ సంఘాల రిలే నిరాహార దీక్షలు✪ ఏపీలో స్కూళ్ల నిర్వహణపై నేడు అధికారుల కీలక సమావేశం… పాఠశాలల మ్యాపింగ్‌పై ఎమ్మెల్యేలకు మూడు రోజుల పాటు అవగాహన కార్యక్రమం… బడుల నిర్వహణ, టీచర్ల సర్దుబాటుపై నిర్ణయం✪ ఉద్యోగ సంఘాలతో నేడు ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలు✪ నేటి నుంచి కార్వీ ఎండీ పార్థసారథిని…