Jagga Reddy Letter: నేను ఇక కాంగ్రెస్ గుంపులో లేను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రచారం జరుగుతున్నట్టుగానే టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి లేఖ రాసిన ఆయన.. ఇక, ఈ లేఖ రాసిన క్షణం నుంచి తాను కాంగ్రెస్ గుంపులో లేను అని పేర్కొన్నారు.. సడెన్‌గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చని పేర్కొన్న ఆయన.. తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కాంగ్రెస్‌లో వర్గ పోరు వుండేదని పేర్కొన్న జగ్గారెడ్డి… త్వరలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానంటూ లేఖలో రాసుకొచ్చారు..
Read Also: TRS vs BJP : ఘర్షణలో గాయపడ్డ పోలీస్..
Also Read
ఇక, ఉద్దేశ పూర్వకంగా నాపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు జగ్గారెడ్డి.. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఉండేదని.. కానీ, అది ఎంతో హుందాగా ఉండేదని.. కానీ, ప్రస్తుతం హుందా తనం లేదని దుయ్యబట్టారు జగ్గారెడ్డి.. సమయం వచ్చినప్పుడు అన్నీ సంక్షిప్తంగా చెబుతానని వెల్లడించారు.. కౌరవ.. పాండవుల యుద్ధం కంటే ముందు అర్జునుడు, భీముడికి బాణాలతో నమస్కారం చేశారు.. అంత మాత్రాన.. ఇద్దరు కోవర్టులు కాదు కదా..? అని ప్రశ్నించారు.. కాంగ్రెస్ నుండి చాలా మంది బయటకు వెళ్లారని జోస్యం చెప్పిన ఆయన.. సడెన్‌గా వచ్చి లాబియింగ్ చేసుకుని పీసీసీ కావొచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. సొంత పార్టీ నాయకులే కోవర్టు అని ప్రచారం చేయడం.. దాన్ని ఖండించే పరిస్థితి కూడా పార్టీలో లేదని మండిపడ్డారు జగ్గారెడ్డి.. నా తల్లి పెంపకం నలుగురికి మేలు చేసే తత్వం నేర్పిందన్న ఆయన.. నేను అప్పులు అడుగుతా తప్పితే.. చందాలు కూడా అడగను అన్నారు.. ఇక్కడ ఉండి కోవర్ట్ అని అనిపించుకోవడం ఎందుకు నాకు..? అని ప్రశ్నించిన ఆయన.. తప్పులు సరిదిద్దుకోండి అంటే… కోవర్టు అని నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, కాంగ్రెస్ పార్టీలో హేమా హామీలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.. పార్టీ పరువు కోసం.. పోటీ చేయించిన నేను కోవర్టునా? అని నిలదీశారు జగ్గారెడ్డి.. పార్టీ పరువు కాపాడిన నేను కోవర్టా..? హుజూరాబాద్‌లో పార్టీ పరువు తీసిన వాళ్లు కోవర్టా..? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!