తెలంగాణలో విద్యార్థులు ..ఉద్యోగుల ఆకాంక్షలు నేర వేరడం లేదని.. ప్రజల కోసం జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమని కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ విధానాలవల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చక్రవర్తి అయితే… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ సామంత రాజు అంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. త్వరలో…
వైఎస్సాటీపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల జాతీయ జెండాను ఎగుర వేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధికారప్రతినిధులు, పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం షర్మిల మాట్లాడారు. నిరుద్యోగి సాగర్ ఆత్మహత్య బాధాకరమన్నారు. ఉద్యోగాలు రావడం లేదంటూ సాగర్ లాంటి ఎంతో మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, లేదా నిరుద్యోగభృతి అని హామీ ఇచ్చిన పాలకులు పట్టించుకోకపోవడంతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. Read Also: దేశంలో భారీగా…
హైదరాబాద్ రాజ్‌భవన్‌లో 73వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పబ్లిక్ గార్డెన్స్ నుంచి రాజ్‌భవన్‌కు మార్చారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు, ఫ్రంట్ లైన్…
✪ నేడు దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు… దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్ వద్ద రిపబ్లిక్ డే పరేడ్.. రాష్ట్రపతి గౌరవ వందనంతో ప్రారంభం కానున్న పరేడ్… పాల్గొననున్న 16 కవాతు విభాగాలు… 75 విమానాలతో వాయుసేన విన్యాసాలు✪ హైదరాబాద్: ఉ.7 గంటలకు రాజ్‌భవన్‌లో రిపబ్లిక్ డే ఉత్సవాలు… జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న గవర్నర్ తమిళిసై✪ విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నేడు గణతంత్ర వేడుకలు… ఉ.9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న గవర్నర్ హరిచందన్, ఉ.9:41…
కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే పద్మ అవార్డుల ప్రకటన తెలంగాణ వాసులకు ఆనందాతిశయాన్ని కలిగించింది. భద్రాద్రి మణుగూరు కు చెందిన వోకల్, ఫోక్ కళాకారుడు రామచంద్రయ్య అనే గిరిజనుడికి పద్మ శ్రీ అవార్డ్ ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రామచంద్రయ్య పద్మశ్రీ అవార్డు కు ఎంపిక కావడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులకు దేశ వ్యాప్తంగా 107 మందిని ఎంపిక చేసిన జాబితాలో రామ చంద్రయ్య (క్రమ…
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీర భద్రం మరోసారి ఎక గ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ పదవిని చేపట్టడం తమ్మినేని వీరభద్రానికి ఇది మూడో సారి. కాగా.. 60 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నికను కూడా పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కాయంజాల్ ఆదివారం నుంచి సీపీఎం తెలంగాణ రాష్ట్ర పార్టీ 3 వ మహాసభలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీర భద్రం మరోసారి ఏక గ్రీవంగా ఎన్నిక అయ్యారు.…
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 73 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం’ భారత దేశ ప్రధాన లక్షణమని సీఎం అన్నారు. భిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, విలక్షణమైన సామాజిక భిన్నత్వంతో కూడిన ఏకత్వాన్ని ప్రదర్శిచడమే.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశం యెక్క గొప్పతనమని సీఎం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం’.. భారత పౌరుల విశ్వమానవ తత్వానికి, సామాజిక,…
ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ప్రజల్లో నిర్లక్ష్యం తగ్గడం లేదు. తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. కొత్తగా మళ్లీ 4వేలకు పైగానే కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు పెద్ద సంఖ్యలోనే కొత్త కేసులు బయటపడ్డాయి.సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలకు వెళ్ళివచ్చినవారు పరీక్షలు చేయించుకోగా కేసులు పెరిగాయని తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24గంటలలో 1 లక్షా 13 వేల 670 టెస్టులు చేయగా.. 4,559మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 1961మంది కోలుకోగా.. ఇద్దరు…
తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకుపోతుంటే.. కేంద్ర ప్రభుత్వం పైసా నిధులివ్వడంలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం మాటలు, ప్రశంసలతోనే కేంద్రం కాలం వెళ్లదీస్తుందన్నారు. పైగా రాష్ట్రాల విషయాలలో అడ్డుతగులుతుందని ఆరోపించారు. ఐఎఎస్, ఐపీఎస్,ఐఎఫ్ఎస్ అధికారులు స్వేచ్ఛగా పని చేయకుండా,సర్వీసు రూల్స్‌ను సవరిస్తున్నారన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించే ప్రయత్నాలు చేస్తుందని వ్యాఖ్యానించారు. Read Also: పేద బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువు కోవద్దా..?…
తెలంగాణలో కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం సంక్రాంతి సెలవులను 30వ తేదీ వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే విద్యార్థులు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని గత సోమవారం నుంచి 8, 9, 10 తరగతులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. అయితే మరో ఐదు రోజుల్లో సెలవులు ముగియడంతో సోమవారం నుంచి స్కూళ్లను తిరిగి తెరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్ధులు ఆన్ లైన్ క్లాసుల…