తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. గత బులెటిన్‌తో పోలిస్తే.. 700కు పైగా కోసులు తగ్గినా.. ఇంకా భారీగానే కొత్త కేసులు వెలుగు చూశాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 88,867 శాంపిల్స్ పరీక్షించగా.. 3,801 కేసులు పాజిటివ్‌గా తేలాయి.. అయితే, గత బులెటిన్‌తో పోలిస్తే.. ఇవాళ టెస్ట్‌ల సంఖ్య కూడా భారీగానే తగ్గిపోయింది.. మరో కోవిడ్ బాధితుడు ప్రాణాలు వదలగా.. 2,046 మంది పూర్తిస్థాయిలో…
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ కోసం కేంద్రం పైన ఒత్తిడి తీసుకువస్తామన్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు. కేంద్రంపైన తెలంగాణ ప్రభుత్వం తరఫున మరింత ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ కు చెందిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న తో పాటు ఆదిలాబాద్ కి నాయకులు, జిల్లాలోని ఇతర ప్రముఖులు ఈ రోజు మంత్రి కేటీఆర్ ను ప్రగతిభవన్‌లో కలిసి కంపెనీ పున ప్రారంభం చేపట్టాల్సిన ఆందోళన కార్యాచరణపై చర్చించారు.…
డ్రగ్స్ వ్యవహారంపై సీరియస్ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. ఇకపై రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడకుండా చేయాలని ఆదేశించారు.. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.. ఇక, డ్రగ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు కేసీఆర్.. దీని కోసం ఎల్లుండి ప్రగతిభవన్‌లో స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు.. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ మంత్రి, సీఎస్, డీజీపీ,…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకాకుండా తప్పుచేశారని… ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆరోపించారు. రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో కనీసం సీనియర్ మంత్రి కూడా లేకపోవడం మంచి సంప్రదాయం కాదన్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికే విఘాతం అని ఈటల అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్య వాదులు బాధపడే సంఘటన అని అభివర్ణించారు. Read Also: 33…
నిజామాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ పై నిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేశారు. దీంతో ఇటు బీజేపీ, అటు టీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చెలరేగింది. కర్రలు, బండలతో దాడులకు దిగారు. ఈ దాడితో ఎంపీ అరవింద్ కారు పూర్తిగా ధ్వంసం అయింది. నిన్న ఆర్మూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.ఈ దాడిపై…
ప్రముఖ తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు గరికపాటి నరసింహారావు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన ఎన్టీవీతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను ఎన్టీవీతో పంచుకున్నారు.నాకు పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందని గరికపాటి అన్నారు. నా ప్రసంగాలు యువత, సమాజంలో మార్పు తీసుకువస్తే చాలన్నారు. పద్మశ్రీ అవార్డు కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని, కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల కృషి అభినందనీయమని ఈ సందర్భంగా గరికపాటి నరసింహరావు అన్నారు. Read Also: కొత్త…
కాంగ్రెస్ నాయకుల కృషితోనే సభ్యత్వాలను పూర్తి చేశామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు 20 లక్షలు పూర్తి అయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సభ్యత్వ నమోదును మరో నాలుగు రోజులు పొగిస్తున్నట్టు తెలిపారు. జనవరి 30 నాటికి 30 లక్షల సభ్యత్వం పూర్తి చేస్తామని మహేష్ గౌడ్ వెల్లడించారు. పార్టీ సభ్యత్వాల్లో టార్గెట్ పూర్తి చేయని వారిపై పార్టీ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.సభ్యత్వ నమోదును లైట్‌గా తీసుకున్న నాయకులపై పార్టీ చర్యలు…
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ఈరోజు జాబితా విడుదల చేశారు. మొత్తం 19 మంది ఎమ్మెల్యేలను జిల్లా అధ్యక్షులుగా నియమించారు. అంతేకాకుండా ఈ జాబితాలో ముగ్గురు ఎంపీలు, ముగ్గురు జెడ్పీ ఛైర్మన్లు, ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. జిల్లాల వారీగా టీఆర్ఎస్ అధ్యక్షుల జాబితా: ఆదిలాబాద్: జోగురామన్న, ఆసిఫాబాద్: కోనప్ప, మంచిర్యాల: బాల్కసుమన్, నిర్మల్: విఠల్ రెడ్డి, నిజామాబాద్: జీవన్ రెడ్డి, కామారెడ్డి: ముజీబుద్దీన్, కరీంనగర్: రామకృష్ణారావు,…