దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టు బండి సంజయ్..హైద్రాబాద్ గల్లీలో కాదని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. ఢీల్లీలో పోరాటం చేస్తే దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తరలి వచ్చి పోరాటం చేస్తారని హరీష్ రావు అన్నారు. ఉద్యోగాలు.. ఉద్యోగాలు అని బీజేపీ నేతలు దొంగ జపం చేస్తున్నారు. దొంగే దొంగ అంటున్నారని అసలు…
తెలంగాణలో త్వరలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనుండడంతో వ్యాపారులు, వినియోగదారులు రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. నల్గొండ జిల్లాలో కిక్కిరిసి పోయాయి రిజిస్ట్రేషన్ల ఆఫీసులు. గంటల తరబడి రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షించకతప్పడం లేదు. మరో రెండురోజుల తర్వాత ఛార్జీలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుగానే స్లాట్ లు బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. సాధారణ వినియోగదారులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం వల్ల స్థలాలు కొనుగోలుచేయడం భారంగా మారుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఒమిక్రాన్ ఎంట్రీతో దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రారంభంమైంది.. ఇదే సమయంలో తెలంగాణలోనూ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.. ఈ నేపథ్యంలో.. సంక్రాంతి సెలవులు ముగుస్తున్న తరుణంలో సెలవులను జనవరి 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. అయితే, ఈ నెలతో సెలవులు ముగిసిపోనున్నాయి.. మరోవైపు.. ఆన్‌లైన్‌తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. తిరిగి ప్రారంభించాలనే డిమాండ్ కూడా ఉంది.. దీంతో.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభించేందుకు…
తెలంగాణ రాష్ట్రం వచ్చినా నిరుద్యోగులు,రైతుల ఆత్మహత్యలు ఆగలేదని వీహెచ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థుల పాత్ర మరువలేనిదన్నారు. అన్నంపెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే బాధగా ఉందన్నారు. కొట్లాడి న్యాయం జరిగేవరకు సాధించుకుందాం..ఆత్మహత్యలు ఆపండి అంటూ వీహెచ్ కోరారు. Read Also: శాశ్వతంగా 124 జీవో,317జీవోను రద్దు చేయాలి: జీవన్‌రెడ్డి దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆపదలో ఉన్నాడు: కోదండ రెడ్డి..ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడుదేశానికి…
317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక ప్రాతిపదికన బదిలీలు చేపట్టాలన్నారు.శాశ్వతంగా 124 జీవో,317జీవోను రద్దు చేయాలన్నారు. స్థానిక ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, 371 డి ఇప్పటికి అమలులో ఉందని గుర్తు చేశారు. 371జీవోను సవరణ చేసే అధికారం ఎవ్వరికి…
తెలంగాణలో భూముల ఆస్తుల విలువను పెంచుతూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలను ఖరారు చేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. హైదరాబాద్ మహానగరంలోని సరూర్ నగర్, బహదూర్‌పురా మండలాల్లో ఎకరం భూమి రూ.22.02 కోట్లుగా ఉన్న ప్రభుత్వ విలువను ఏకంగా రూ.24.22 కోట్లకు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. Read Also: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు రీ…
కరోనా కారణంగా జనవరి 8 నుంచి జనవరి 16 వరకు, ఆ తరువాత సెలవులను జనవరి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 31తో స్కూళ్లకు సెలవులు ముగియనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభిస్తారా లేదా అనే దానిపై ఇప్పటి వరకు సందేహాలు ఉన్నాయి. అయితే, ఫిబ్రవరి 1 వ తేదీన స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు సర్కార్ సిద్దమవుతున్నది. స్కూళ్లు తెరిచిన తరువాత విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలను కఠినంగా…
✪ తిరుమల: నేడు ఉ.9 గంటలకు ఆన్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల… ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు రోజుకు 10వేల సర్వదర్శనం టోకెన్లను అందుబాటులో ఉంచనున్న టీటీడీ✪ విశాఖ: నేడు మూడోరోజు పీఆర్సీ సాధన సమితి నిరసన దీక్ష✪ అనంతపురం: హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ నేడు అఖిలపక్షం బంద్✪ సమ్మెకు సిద్ధం అవుతున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు.. కార్మిక సంఘాలతో ఈరోజు లేబర్ కమిషన్ అధికారుల సమావేశం✪ హైదరాబాద్: నేడు కలెక్టరేట్ల ముట్టడికి…
కొత్త ఏడాది వచ్చింది.. కొత్త క్యాలెండర్ల ఆవిష్కరణ కొనసాగుతూనే ఉంది.. ఇక, జీవితానుభవాలను కవిత్వంగా మలిచి, ఆ కవిత్వాన్ని మంచిమాటలుగా మార్చి, కొటేషన్ల రూపంలో ప్రతి ఏటా క్యాలెండరుగా అందించే కవి కొత్త శ్రీనివాస్ రూపొందించిన 2022 క్యాలెండరును ఆవిష్కరించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ప్రగతిభవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.. ఈ సందర్భంగా క్యాలెండర్ రూపకర్త, రచయిత కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ “మహాకవి శ్రీశ్రీ అన్నట్లు “మానవ జీవితమే ఒక మహాభారతం – అది మంచి చెడుల…