ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ నగర శివారులోని శంకర్ పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని హైకోర్టులో చిన్ని కృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేసినందుకు.. తనపై కొందరు దాడికి యత్నించారని శంకర్ పల్లి పోలీస్ స్టేషన్‌లో చిన్ని కృష్ణ శనివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న తనపై పరుష పదజాలంతో దూషించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా చిన్ని కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Read Also: Pawan Kalyan: ‘భీమ్లా నాయక్’కు దారిచ్చిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’