ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ మేడారం జాతరకు ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… సీఎం, పీఎం మేడారం జాతరను చిన్నగా చేసి చూపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.. మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకుని ఆయన.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క పేరుపెట్టాలని డిమాండ్ చేశారు.. కాంగ్రెస్ ది భిన్నత్వంలో ఏకత్వం… ప్రాంతీయ పార్టీల్లో ఏకత్వంలో మూర్ఖత్వం అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ.. అన్ని పరిస్థితులు సర్ధుకుంటాయి అంటూ.. జగ్గారెడ్డి ఎపిసోడ్‌పై కామెంట్ చేవారు.. ఇక, పోలీసులపై మాట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావాని.. ఆవేశంతో అలా మాట్లాడాల్సి వచ్చిందని.. కానీ, అలా మాట్లాడకుండా ఉండాల్సింది అన్నారు.. సమ్మక్క సారలమ్మల పోరాటమే మాకు స్ఫూర్తి.. తెలంగాణ ఉద్యమానికి కూడా సమ్మక్క-సారలమ్మలే స్ఫూర్తిగా చెప్పారు రేవంత్‌రెడ్డి.
Read Also: Revanth Reddy: జగ్గారెడ్డి ఇష్యూ టీకప్పులో తుఫాన్..!
మేడారం మహాజాతరకు ప్రపంచ గుర్తింపు రావాల్సి ఉన్నా గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు రేవంత్‌రెడ్డి.. ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క పేరుపెట్టాలన్న ఆయన.. కేసీఆర్ ప్రభుత్వం మేడారం జాతరను విస్మరించిందని మండిపడ్డారు.. సమ్మక్క పోరాట స్ఫూర్తిని, తెలంగాణ అత్మగౌరవాన్ని కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. సమ్మక్క చరిత్రను కనుమరుగు చేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు.. కృత్రిమమైన కట్టడం దగ్గర పొర్లుదండాలు పెట్టిన కేసీఆర్ కుటుంబం.. మేడారం జాతరకు ఎందుకు రాలేదు? అని నిలదీశారు.. ముచ్చింతల్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. మేడారానికి ఎందుకు రాలేదు? అని ప్రశ్నించిన రేవంత్.. సీఎం, పీఎం మేడారం జాతరను చిన్నగా చేసి చూపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.. ఇక, మేడారం మహాజాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు రేవంత్.. ప్రతీ మేడారం మహాజాతరకు రూ. 500 కోట్లు కేటాయించాలన్న ఆయన.. పేదల విశ్వాసాలపట్ల కేసీఆర్ కుటుంబానికి నమ్మకం లేదన్నారు.. మరోవైపు, తెలంగాణలో జిల్లాలను కుక్కచింపిన విస్తరిగా మార్చారని ఫైర్ అయ్యారు రేవంత్.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరుపెడతామన్న ఆయన.. సీతక్క సంతకంతోనే ములుగు జిల్లాను తీసుకువస్తాం అన్నారు.. 12 నెలల తర్వాత తెలంగాణలో సోనియమ్మ రాజ్యం వస్తుంది.. ఆ రాజ్యంలో సీతక్కకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.