కేవలం మూడు వందల రుపాయలు ముగ్గురిని జైలు పాలు చేసింది.. రూ. 300 అంటే.. ఏ చిల్లర దొంగలో అనుకోకండా… ఎందుకంటే.. నిందితుల్లో ఒకరు సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కాగా మరొకరు ప్రైవేట్ ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.. ఇంకొకరు మంచి కాలేజీలో చదువుకుంటున్నాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ జూబ్లీబస్టాండ్ వద్ద రాత్రి సమయంలో లిఫ్ట్ కోసం విశాక్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఎదురుచూస్తున్నాడు.. అదే సమయంలో అటుగా కారులో వచ్చిన ముగ్గురు.. లిఫ్ట్ ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు.. కొంతదూరం వెళ్లిన తర్వాత అతని వద్ద ఉన్న నగదుతో పాటు సెల్‌ఫోన్ లాక్కొని కొట్టి వదిలేశారు.. దీంతో, భాదితుడు కార్ఖాన పోలీస్ స్టేషసులను ఆశ్రయించాడు.. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ సమయంలో వెళ్లిన కారు కదలికలను శోధించారు.. కారుకు నెంబర్ ప్లేట్ కూడా లేకపోవడంతో.. పదుల కొద్ది సీసీ కెమెరాల్లో గాలించారు.. చివరికి కారు వెళ్లిన ప్రాంతాన్ని కనుగొన్నారు.. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.. మద్యం మత్తులో ఇది జరిగినట్టు నిందితులు అంగీకరించారు.. దీంతో ముగ్గురిని ఆరెస్ట్ చేసిన పోలీసులు, మొబైల్ ఫోన్‌లతో పాటు.. వారి వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.