కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు.. దేశం బాగుపడాలంటే.. బీజేపీని గద్దె దింపాలని.. దేశం నుంచి తరిమివేయాలంటూ పిలుపునిచ్చిన ఆయన.. మిమ్మల్ని గద్దె దింపుతాం.. మాకు కావాల్సిన వాళ్లను తెచ్చుకుంటాం అని హెచ్చరించిన విషయం తెలిసిందే.. ఇక, బీజేపీయేతర శక్తులకు కూడగట్టే పనిలో పడిపోయారు కేసీఆర్.. అందులో భాగంగా రేపు ముంబై వెళ్లనున్నారు.. ఇటీవల కేసీఆర్‌కు ఫోన్ చేసి లంచ్‌కు రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆహ్వానించిన విషయం తెలిసిందే కాగా.. అందుకోసం రేపు ఉదయం 11 గంటలకు బేంగపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరి వెళ్తారు.. ఇక, మధ్యాహ్నం లంచ్ చేసి.. దేశంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, వ్యూహాలు, కార్యాచరణ తదితర అంశాలపై చర్చిస్తారు.. ఉద్ధవ్ థాకరేతో భేటీ తర్వాత రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం కేసీఆర్.
Read Also: Jagga Reddy New Party: రాజీనామాపై తగ్గేదేలే.. కొత్త పార్టీ పెడతా..