Revanth Reddy: జగ్గారెడ్డి ఇష్యూ టీకప్పులో తుఫాన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. అధిష్టానానికి లేఖరాసిన ఆయన.. పార్టీలో ఉన్న పరిస్థితిని.. తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.. పరోక్షంగా టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేశారు.. ఇక, ఈ లేఖ రాసిన వెంటనే.. తాను కాంగ్రెస్ గుంపులో లేను అంటూ పేర్కొని చర్చకు తెరలేపారు.. త్వరలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే, జగ్గారెడ్డి అంశంపై స్పందించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇది మా కుటుంబ సమస్యగా వ్యాఖ్యానించారు.. కుటుంబం అన్నప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయని.. మా సమస్యను మేమే పరిష్కరించుకుంటామని వెల్లడించారు.. ఇక, దీనిని మీడియా పెద్దగా చూపాల్సిన అవసరం లేదన్న ఆయన.. గోతికాడ నక్కల్లాగా చూసే టీఆర్‌ఎస్ పార్టీ ఆటలు సాగవని స్పష్టం చేశారు.. మీడియాలో రాస్తుంటారుగా టీ కప్పులో తుఫాన్ అంటూ.. జగ్గారెడ్డి వ్యవహారం కూడా అలాగే సమసిపోతుందన్నారు.. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు లేవు, భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని.. జగ్గారెడ్డి కోసం టీఆర్ఎస్ చేసే ఆలోచనలు అడియాశలవుతాయి, ఈ అంశాన్ని సానుకూలంగా పరిష్కరించుకుని ముందుకెళ్తామని వెల్లడించారు రేవంత్‌రెడ్డి.
Read Also: Jagga Reddy Letter: నేను ఇక కాంగ్రెస్ గుంపులో లేను..
Also Read
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!