Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nora Fatehi Song Controversy: ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాటపై తీవ్ర వివాదమే రేగింది.. ఈ పాటలో నోరా ఫతేహి నృత్య భంగిమలు, పాటలోని అసభ్యకరమైన సాహిత్యం తీవ్ర విమర్శలకు గురయ్యాయి. అసభ్యకరమైన సాహిత్యం, నృత్య భంగిమల కారణంగా తీవ్ర విమర్శలు రావడంతో గీత రచయిత స్పందించారు. ఈ పాటకు గీత రచయిత రఖీబ్ ఆలం.. పేరు కనిపించడంతో నెటిజన్లు ఆయనను కూడా టార్గెట్ చేశారు. దీనిపై స్పందించిన రఖీబ్ ఆలం తాను అసలు ఈ పాట సాహిత్యం రాయలేదని స్పష్టం చేశారు.
“అది నా తప్పు కాదు” – గీత రచయిత
ఒక మీడియా ఇంటర్వ్యూలో రఖీబ్ ఆలం మాట్లాడుతూ, ఈ పాటను చిత్ర దర్శకుడు Prem మొదట కన్నడలో రాశారని తెలిపారు. “నన్ను ఈ పాట రాయమని అడిగినప్పుడు నేను నిరాకరించాను. అలాంటి సాహిత్యం ఉన్న పాటలు సెన్సార్ సమస్యలు ఎదుర్కొంటాయని కూడా చెప్పాను. కానీ, చివరకు వారు అసలు కన్నడ వెర్షన్‌ను యథాతథంగా హిందీలోకి అనువదించాలని కోరారు. అందులో ఉన్న కొన్ని పదాలు అప్పటికే ఒరిజినల్ వెర్షన్‌లో ఉన్నాయి,” అని ఆయన చెప్పారు.
Also Read
పాటలోని కొన్ని లైన్లు ద్వంద్వార్థంతో ఉన్నాయని అంగీకరించిన ఆయన, “చివరికి అది మద్యం సీసా గురించి అని చెప్పినా, మధ్యలోని పదాలు చాలా అసభ్యంగా వినిపిస్తాయి. అందుకే నేను మొదట రాయడానికి ఒప్పుకోలేదు,” అని తెలిపారు.
సోషల్ మీడియాలో క్షమాపణ
ఈ వివాదం పెరగడంతో రఖీబ్ ఆలం సోషల్ మీడియాలో క్షమాపణ చెప్పారు. “నేను మంచి పాటలు రాస్తే ఎవ్వరూ గుర్తించరు. కానీ ఇలాంటి వివాదం మాత్రం పెద్ద చర్చ అవుతుంది,” అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఈ పాటపై తీవ్ర విమర్శలు రావడంతో నిర్మాతలు అధికారిక హిందీ వెర్షన్‌ను యూట్యూబ్ నుంచి తొలగించినట్టు సమాచారం. అయినప్పటికీ ఈ వివాదం సోషల్ మీడియాలో ఇంకా చర్చకు దారితీస్తూనే ఉంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!