హైదరాబాద్ నగరంలోని ఘాట్కేసర్ ఫ్లైఓవర్ పనులు పునఃప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ పనులు గత కొన్ని నెలలుగా ఆగిపోయిన నేపథ్యంలో ప్రజలకు ఎదురవుతున్న అసౌకర్యాన్ని వివరించారు. రోజూ ట్రాఫిక్ జాంలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల పనులను వేగంగా పూర్తిచేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.…
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం SLBC సహాయక చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సహాయక చర్యలను వేగంగా అమలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేకించి, సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎస్‌ను (చీఫ్ సెక్రటరీ) ఆదేశించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి, SLBC సహాయక చర్యలపై తాజా…
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ (TG Assembly) సమావేశాల్లో శనివారం మధ్యాహ్నం ఉత్కంఠభరితమైన చర్చ చోటుచేసుకుంది. రైతు సమస్యలు, రుణమాఫీ, వడ్ల బోనస్ అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. కౌశిక్ రెడ్డికి మంత్రి సీతక్క కౌంటర్ ఇస్తూ – “నీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు. నా నియోజకవర్గంలో నేను తిరిగిన…
Minister Seethakka : వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ ఆధ్వర్యంలో సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్ లో డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. మిషన్ పరివర్తన కార్యక్రమం ద్వారా దేశంలోని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలను సహకారం చేస్తూ ముందుకు వెళుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. డి అడిక్షన్ సెంటర్ నిర్వహణ కోసం వికలాంగులు,వయోవృద్ధులు,ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ ద్వారా 13 లక్షల 80 వేల…
BRS : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీలు శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ అభివృద్ధి పనులు శూన్యంగా ఉన్నాయని ఆరోపిస్తూ, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. “అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో” అంటూ నినాదాలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు.…
పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగాల్లో వివిధ పోస్టులకు ఎంపికైన 922 మందికి అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అభ్యర్థులు నియామక పత్రాలు గురించి దశాబ్దకాలం ఎదురుచూశారన్నారు. ఉద్యోగ బాధ్యత అనిర్వచనీయ ఆనందాయకమని తెలిపారు.
New Liquor Brands : తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత మద్యం మార్కెట్లో నూతన బ్రాండ్ల ప్రవేశానికి అనుమతులు మంజూరు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ (Prohibition & Excise Department) ఇప్పటికే కొత్త మద్యం బ్రాండ్ల రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం తెలిపింది. ప్రారంభంలో కొత్త మద్యం బ్రాండ్ల దరఖాస్తుల సమర్పణకు మార్చి 15 వరకు గడువు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ, ఇప్పుడు దానిని…
తెలంగాణ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. శాసన సభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. విద్య, ఉద్యోగావకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టభద్రత కల్పిస్తూ బిల్లు.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లు.. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మారుస్తూ మరో బిల్లు ప్రవేశపెట్టారు. Also Read:Phone:…
Bandi Sanjay : సిరిసిల్లలో జరిగిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడంపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్, కోట్ల, నీలం, కాసు వంటి ప్రముఖుల పేర్లు తొలగించే ధైర్యం ఉందా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు దేశభక్తుడు, స్వాతంత్ర్యం కోసం అనేక…
Konda Surekha : తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను తెలుసుకోవడానికి బీఆర్ఎస్ భయపడుతోందని, ప్రజల ముందు తాము చేసిన తప్పులు బయటపడుతాయనే భయంతోనే అసలు విషయాలను దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో అడ్డుపడుతూ బీఆర్ఎస్ సభ్యులు అనవసరంగా అర్ధాంతరంగా వ్యవహరించడం సబబు కాదని, ప్రజలు ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నారని అన్నారు. “బీఆర్ఎస్ సభ్యులు…