హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి.. నేడు కూడా ఆందోళన చేపట్టేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిన్న రణరంగంగా మారింది. ఆదివారం రాత్రి 400 ఎకరాల భూముల వేలంలో భాగంగా చదును చేసేందుకు 20 జేసీబీతో చెట్లను తొలగిస్తూ స్థలాన్ని సమాంతరంగా చేస్తుండడం పట్ల విద్యార్థులు క్యాంపస్ ముందు నిరసనలతో హోరెత్తించారు.. ప్రభుత్వ తీరు పట్ల విద్యార్థులు మండిపడ్డారు… క్యాంపస్ లో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం తీరు పట్ల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు… పచ్చటి వాతావరణంతో ఉన్న క్యాంపస్ ను చెట్లు తొలగించి, క్యాంపస్ స్థలాన్ని అమ్మేసేందుకు కుట్ర పొందుతున్నారు అంటూ ఆందోళన చేపట్టారు.. సెలవు రోజులను చూసుకుని జేసీబీల సహాయంతో స్థలాన్ని శుభ్రం చేస్తున్నారని వారు మండిపడ్డారు..
READ MORE: RR vs CSK: కాస్త లేట్ అయింది.. నా కెప్టెన్సీలో విజయం సాధించడం సంతోషం!
ఎట్టి పరిస్థితిలో క్యాంపస్ స్థలాన్ని కోల్పోయేది లేదని విద్యార్థులంతా కలిసికట్టుగా పోరాటం చేసి తమ స్థలాన్ని కాపాడుకుంటామని తెలిపారు.. ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని లేనిపక్షంలో విద్యార్థుల ఆగ్రహాన్ని చూడవలసి వస్తుందంటూ విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు… నిరసనలు తెలుపుతున్న తమపై అకారణంగా పోలీసులు అరెస్టులు చేసి భయపెట్టాలని చూస్తున్నారని.. ఉద్యమాన్ని మాత్రం ఆపేది లేదంటూ హెచ్చరించారు.. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థి నేతలను రాత్రి 10 తర్వాత విడుదల చేశారు. ఈరోజు కూడా ఆందోళనలు కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్, బీజేపీ విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికాయి. దీంతో క్యాంపస్‌లో టెన్షన్ వాతావరణం కొనసాగింది.
READ MORE: Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య చెడుతున్న సంబంధాలు..! కారణమిదేనా?