Droupadi Murmu : శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. ఐదు రోజులపాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్ల పై గురువారం డా.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి విస్తృత ఏర్పాట్లు చేయాలని సి.ఎస్. ఆదేశించారు. కేంద్ర…
CMRF Record : తెలంగాణలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండేళ్లలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎప్పుడూ లేని స్థాయిలో వైద్య సహాయం అందింది. 2023 డిసెంబర్ 7 నుంచి 2025 డిసెంబర్ 6 వరకు మొత్తం 3,76,373 మంది లబ్ధిదారులకు రూ.1,685.79 కోట్ల సహాయం అందజేశారు. గతంలో 2014 నుంచి 2024 వరకు సంవత్సరానికి సగటున రూ.450 కోట్లు మాత్రమే…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు బాలీవుడ్ మెగా స్టార్లు రానుండటం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగనున్న ఈ అంతర్జాతీయ వేదికకు సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ హాజరు కానున్నట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. ఇద్దరు నటులు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం హర్షోల్లాసంగా ఈ సమ్మిట్‌ను…
Bhatti Vikramarka : రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్ సర్వీసెస్ మెయిన్స్, ఇంటర్వ్యూ లకు ఎంతమంది ఎంపికైనా ఆర్థిక సహాయం అందిస్తాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన ప్రజా భవన్ లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన 50 మందికి చెక్కులు అందించిన అనంతరం ప్రసంగించారు. సివిల్ సర్వీసుల్లో విజయం సాధించి రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని తపిస్తున్న అందరికీ అభినందనలని డిప్యూటీ సీఎం…
HILT Policy : హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకురావాలని భావించిన కీలక విధాన నిర్ణయం (HILT Policy) జీవో విడుదల కాకముందే ప్రతిపక్షాలకు లీక్ కావడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్గతంగా ఈ కీలక సమాచారం బయటకు ఎలా వచ్చిందనే దానిపై అధికారులు సీరియస్‌గా దృష్టి సారించి, విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పారిశ్రామిక భూములపై హిల్ట్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్న దశలోనే, ఈ…
GHMC : జీహెచ్ఎంసీ విస్తరణకు కీలకమైన ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’పై గవర్నర్ ఆమోదం తెలిపారు. ఫైల్ ప్రభుత్వానికి చేరడంతో, తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గెజిట్ విడుదల చేయనుంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించే తీర్మానం చేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల, బయట ఉన్న 27 పురపాలక సంస్థలను జీహెచ్ఎంసీ…
వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు(ఎం), అమరచింత మున్సిపాలిటీల పరిధిలో రూ. 151.92 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే “తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్”పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంట్ తయారీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్‌పై లోతైన చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత…
Ponnam Prabhakar : పేద, మధ్యతరగతి ప్రజలకు చౌక ధరకే కడుపు నిండా భోజనం అందించే ఇందిరమ్మ క్యాంటీన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. హైదరాబాద్‌లో కొత్తగా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు మ్యాపింగ్ కూడా సిద్ధమైంది. కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందించే ఈ స్కీమ్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణలో పేదల ఆకలిని తీర్చే లక్ష్యంతో ఇందిరమ్మ క్యాంటీన్ల ఎస్టాబ్లిష్మెంట్ కోసం GHMC అధికారులు మ్యాపింగ్ ప్లానింగ్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు.…