Uttam Kumar Reddy : తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆశావహుల జాబితాను కాంగ్రెస్ హైకమాండ్‌కు పంపినట్లు సమాచారం. హైకమాండ్ పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రత్యేకంగా కలుసుకుని మంత్రివర్గ విస్తరణపై అధికారికంగా సమాచారం అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 3వ తేదీన నలుగురు కొత్త మంత్రులు కేబినెట్లో చేరే అవకాశముందని తెలుస్తోంది. ఇక,…
Duddilla Sridhar Babu : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ,మైనార్టీల,వెనుకబడిన తరగతుల, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కొరకు రాజీవ్ యువ వికాసం కార్యక్రమని, రాష్ట్రంలో ఉన్న యువతకు స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం…
గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కింది. 2001లో చంద్రబాబు హయాంలో గచ్చిబౌలి స్టేడియం నిర్మాణం కోసం హెచ్‌సీయూకి చెందిన 2300 ఎకరాల నుంచి 40 ఎకరాలు తీసుకున్నారు. అలాగే, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎంజీ భారత్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హెచ్‌సీయూ భూమిలో నుంచి మరో 400 ఎకరాలు కేటాయించారు. ఈ 400 ఎకరాల కేటాయింపును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నిరసనల నేపథ్యంలో గోపన్‌పల్లి పరిధిలో ప్రత్యామ్నాయంగా 400 ఎకరాలు కేటాయించారు.…
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై యాజమాన్యం తనదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం.. 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు ఈ భూమిని కేటాయించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోని కేసుల్లో చట్టపరంగా గెలవడం ద్వారా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిపై యాజమాన్యాన్ని దక్కించుకుంది. ఆ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో చిన్న చిన్న అమ్మాయిలను మెడలు పట్టుకుని గుంజుకుపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "తెలంగాణ సమాజం బాధ పడుతుంది. సీఎం కి కనీస మానవత్వం లేదు.. మా భూములను అమ్మకండి అని విద్యార్థులు అడిగితే అమానుషంగా వ్యవహరించారు. ఈ నెల గడవాలి అంటే హెచ్‌సీయూ భూములు అమ్మాలి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తెలంగాణలో హరిత విధ్వంసం సృష్టిస్తున్నారని ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా తెలిపారు. ముందు బీఆర్ఎస్ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా ఎక్కువ చేస్తుందని పేర్కొన్నారు. "బీఆర్ఎస్ 25 లక్షల చెట్లు కాళేశ్వరం కోసం నరికేసి, హరితహారం పేరుతో కొనోకార్పస్ కల్లోలం తెచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కంచ, గచ్చిబౌలిలో చెట్లు నరికి ప్రకృతి నాశనం చేస్తోంది. గొడ్డలి మారలేదు, పట్టిన…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి.. నేడు కూడా ఆందోళన చేపట్టేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిన్న రణరంగంగా మారింది. ఆదివారం రాత్రి 400 ఎకరాల భూముల వేలంలో భాగంగా చదును చేసేందుకు 20 జేసీబీతో చెట్లను తొలగిస్తూ స్థలాన్ని సమాంతరంగా చేస్తుండడం పట్ల విద్యార్థులు క్యాంపస్ ముందు నిరసనలతో హోరెత్తించారు..
RS Praveen Kumar : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం రాక్షస, రాబందుల పాలన నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి మీద 83 కేసులు ఉన్నప్పటికీ, ఆయన సీఎం, హోంమంత్రి హోదాలో ఉండడం దౌర్భాగ్యమన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి బాధితుడు, ఫిర్యాదుదారుడు, హోంమంత్రి, జైలు సూపరింటెండెంట్, తలారీ.. ఇలా అన్నీ ఆయనే అయ్యాడు” అని…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ట్విట్టర్ వార్ మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ కీలక వ్యాఖ్య చేశారు. “తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకపూరిత నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం ఒక పెద్ద హరిత ప్రాంతాన్ని కోల్పోనుంది. కంచే-గచ్చిబౌళిలో 400 ఎకరాల భూమిని అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను,” అని కేటీఆర్…
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు గురువారం రాత్రి నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 11 రోజులపాటు నిరంతరంగా కొనసాగిన ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక అంశాలను చర్చించి, ఆమోదం తెలిపింది. సభలో ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు పలు ముఖ్యమైన తీర్మానాలు ఆమోదించబడ్డాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు సభ సమావేశమైంది. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) ఉభయసభల్లో…