KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ట్విట్టర్ వార్ మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ కీలక వ్యాఖ్య చేశారు. “తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకపూరిత నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం ఒక పెద్ద హరిత ప్రాంతాన్ని కోల్పోనుంది. కంచే-గచ్చిబౌళిలో 400 ఎకరాల భూమిని అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను,” అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అంతేకాదు, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రకటనపై కూడా ఆయన స్పందించారు. “నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఆ భూమిలో ఎటువంటి జంతువులు లేవని తప్పుగా పేర్కొన్నారు. అయితే, విద్యార్థులు, అధ్యాపకుల సమాచారాన్ని ప్రకారం, హైదరాబాద్ విశ్వవిద్యాలయ (HCU) ప్రాంగణంలో 700కు పైగా పుష్ప వృక్ష జాతులు, 10 రకాల సస్తన ప్రాణులు (mammals), 15 రకాల సరీసృపాలు (reptiles), 200కి పైగా పక్షి జాతులు నివసిస్తున్నాయి. అంతేకాదు, అక్కడి శిలా నిర్మాణాలు ఏకంగా బిలియన్ సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నాయి” అని వివరించారు.
కేటీఆర్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ, “ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఓ విపరీతమైన నిర్ణయం. ఒక వైపు ప్రకృతి రక్షణ అంటూ మాట్లాడుతూ, మరోవైపు ప్రకృతి నాశనానికి పాల్పడటం ఆశ్చర్యకరం. ఈ భూమిని వాణిజ్య కేంద్రముగా మార్చేందుకు, భారీ భవనాలు, షాపింగ్ మాల్స్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది నగర భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే చర్య” అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, “ఈ అవివేకపు విధానాన్ని వెంటనే విరమించుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను!” అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Boianapalli Vinod Kumar: రజతోత్సవ సభ.. కొత్త తరానికి కొత్త ఆలోచనలు..!