Duddilla Sridhar Babu : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ,మైనార్టీల,వెనుకబడిన తరగతుల, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కొరకు రాజీవ్ యువ వికాసం కార్యక్రమని, రాష్ట్రంలో ఉన్న యువతకు స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం ద్వారా రూ.50 వేల నుండి రూ.4 లక్షల వరకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.
అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. గడిచిన 10 సంవత్సరాల తర్వాత యువతకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామని, ఈ కార్యక్రమంలో అన్నికూలాల వారికి అవకాశమని ఆయన మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గ్రామీణ ప్రాంతంలో రూ.లక్ష 50వేల ఆదాయం,పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల ఆదాయం ఉన్నవారికి ఈ పథకం వర్తింపు అని, నిరుద్యోగ, నిరుపేద యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవనశైలి మెరుగుపరిచేందుకు వారదర్శకంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఇచ్చిన నిధులు వాటికే ఖర్చు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, జిల్లా పాలనయంత్రాంగం దీనికి సహకరించాలన్నారు మంత్రి శ్రీధర్‌బాబు.
Jagadish Reddy : ప్రజలే కాంగ్రెస్ పార్టీకి ఉరి వేసే రోజులు దగ్గర పడ్డాయి..